Rajdeep Sardesai – KCR : కొంప ముంచిన రాజ్‌దీప్.. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు
కొన్ని కొన్ని సార్లు ఉత్సాహంతో మనం చేసే కొన్ని కామెంట్స్ మనకే కష్టాలు తెచ్చిపెడతాయి. ఊహించని చిక్కుల్లో పడేస్తాయి. ఇప్పుడు అలాగే ఫేమస్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి చేసిన కామెంట్స్‌ను కేసీఆర్‌కు లేని చిక్కులు తెచ్చిపెట్టాయి. రీసెంట్‌గా తాను చేసిన ఓ వీడియోలో.. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ఫ్రంట్ గురించి రాజ్‌దీప్ మాట్లాడారు.
కొన్ని కొన్ని సార్లు ఉత్సాహంతో మనం చేసే కొన్ని కామెంట్స్ మనకే కష్టాలు తెచ్చిపెడతాయి. ఊహించని చిక్కుల్లో పడేస్తాయి. ఇప్పుడు అలాగే ఫేమస్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి చేసిన కామెంట్స్‌ను కేసీఆర్‌కు లేని చిక్కులు తెచ్చిపెట్టాయి. రీసెంట్‌గా తాను చేసిన ఓ వీడియోలో.. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ఫ్రంట్ గురించి రాజ్‌దీప్ (Rajdeep Saredesai) మాట్లాడారు.
ఆ ఫ్రంట్‌కు చైర్మన్ బాధ్యత అప్పగిస్తే.. 2024 ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం తాను పెట్టుకుంటానని కేసీఆర్ (KCR) చెప్పారన్నారు రాజ్‌దీప్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రాజకీయ దుమారం లేపడమే కాకుండా తెలంగాణలో ప్రతిపక్షాలకు కేసీఆర్‌ను టార్గెట్ చేసే ఆయుధాన్ని ఇస్తున్నాయి. రాజ్‌దీప్ కామెంట్స్‌ను బేస్ చేసుకుని కేసీఆర్ టార్గెట్‌గా కామెంట్స్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికలకు ఫండింగ్ చేసేంత డబ్బు కేసీఆర్‌కు ఎక్కడ నుంచి వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నాయి. తనకు వేల కోట్లు ఆస్తులు లేవని.. తాను వ్యవసాయం చేసుకుని బతికే సామాన్య నేతనంటూ చాలా సార్లు కేసీఆర్ చెప్పారు. తన కుంటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా మంచి స్థానంలో ఉన్నారే తప్ప.. వేల కోట్లు కూడగట్టుకోలేదని చెప్పారు.
అయితే ఇంత సాధారణ నాయకుడికి.. లోక్‌సభ్ ఎన్నికలకు ఫండింగ్ ఇచ్చేంత డబ్బు ఎలా వచ్చిందనేది ఇప్పుడు అంతా అడుగుతున్న క్వశ్చన్. అవినీతి చేయకుండా ఇంత డబ్బు కేసీఆర్ ఎలా సంపాదించారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సంక్షేమ పాలన పేరు చెప్పి వేల కోట్లు దోచుకున్నారని డిసైడ్ చేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ప్రాజెక్టులు అప్పగించి వందల కోట్లు కమీషన్లు తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. నిజానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యే భూకబ్జాలు చేస్తున్నారంటూ చాలా కాలంగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దానికి తోడు కవిత లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కోవడం కేసీఆర్ ఫ్యామిలీకి మాయని మచ్చగా మారింది.
ఇలాంటి సిచ్యువేషన్‌లో రాజ్‌దీప్ చేసిన కామెంట్స్ కేసీఆర్‌కు కొత్త తంటాలు తెచ్చిపెట్టాయి. నిజానికి కేసీఆర్‌ను బుక్ చేయడం రాజ్‌దీప్ ఉద్దేశం కాదు. ముందు నుంచీ ఆయన బీజేపీ వ్యతిరేకి అనే మార్క్ ఉన్న జర్నలిస్ట్. చాన్స్ దొరికిన ప్రతీసారి తన యాంటీ బీజేపీ వాదనను, వైఖరిని బయట పెట్టే వ్యక్తి. ఇప్పుడు కూడా దేశంలో మోదీపై వ్యతిరేకత ఉంది అనే చెప్పే ప్రయత్నంలో మోదీ వ్యతిరేక కూటమి గురించి మాట్లాడారు. ఆ సందర్భంలోనే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి కామెంట్ చేశారు రాజ్‌దీప్. అనుకోకుండా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వీటిని కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలు ఎలా డిఫెండ్ చేస్తారో చూడాలి.