Political Partys: ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాలు, విజయానుభవాలు – జనసేనకు అధికారాన్ని అందించేనా..?

రాజకీయపార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత సులువు కాదు అనే మాట వినే ఉంటారు. వినకుంటే ఈ స్టోరీ చూసేయండి మీకే అర్థం అవుతుంది. రాజకీయపార్టీలు పెట్టి అనతికాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నవారు కొందరైతే..14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటాలు చేసి రాష్టాన్ని, పాలనా అధికారాన్ని సాధించిన వారు మరికొందరు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో పార్టీ పెట్టి తొమ్మిదేళ్ల పాటూ అవిశ్రాంత యుద్దం చేసి సీఎం అయిన వారు ఉన్నారు. ఈ మీటరుకు సమానంగా ప్రయాణం చేస్తూ జనసేన 10వ ఆవిర్భావానికి సిద్దం అవుతుంది. ఇలా పలు రకాలా పార్టీల వారు ఏవిధంగా ముందుకు వెళ్లి అధికారాన్ని సాధించారు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 03:45 PMLast Updated on: Mar 12, 2023 | 3:45 PM

Political Partys Expeiance Give The Victory To Janasena
  • తెలుగుదేశం ఎన్టీఆర్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన వ్యక్తులలో నందమూరి తారక రామారావు అగ్రజులు. ఈయన 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ అప్పట్లో చేసిన తప్పిదాలే దీనికి ప్రదాన కారణంగా చెప్పాలి. నెలల వ్యవధిలోనే ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు మారుస్తూ వస్తుంటే ప్రభుత్వపాలన గాడితప్పుతుందని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ స్థాపించి 9నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఇలా సాధించడానికి ఆయన ఎంచుకున్న విధానం ఒక్కటే. ప్రజాచైతన్య రథంపైకి ఎక్కి ఊరూవాడా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది కదిలిరండి అన్న ఒక్క మాటకు వేలకు వేల మంది తమ సొంత ఖర్చుతో ప్రసంగానికి వచ్చేవారు. దీనిని చూసిన కొందరు కాంగ్రెస్ నేతలు సినీ గ్లామర్ అన్నారు. కానీ ఎన్టీఆర్ ఎక్కడా వెనక్కి జంకలేదు. ఇందిరాగాంధీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే ప్రజల్లోకి వెళ్లారు. దీని ప్రతిఫలమే 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 202 ఎమ్మెల్యేలు, 35 ఎంపీలను గెలవగలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది అద్భుత విజయం అని చెప్పాలి.

  • టీఆర్ఎస్ కేసీఆర్

అదే దారిని ఎంచుకుంది మరో పార్టీ. అప్పటికే ఎన్టీఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ 2001 ఏప్రిల్ లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీని స్థాపించారు. నెలకొల్పిన మొదటి రోజునుంచే 14ఏళ్ల పాటూ అలుపెరుగని పోరాటాలు చేశారు.‎ జైలు పాలైయ్యారు. నిరాహార దీక్షలు చేశారు. కాంగ్రెస్ అవలంబింస్తున్న ప్రాంతీయ పక్షపాతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా చేస్తూనే 2006 లోకల్ వార్ లో పోటీ చేసి దెబ్బతిన్నారు. ఎక్కడా నిరుత్సాహం చెందలేదు. అలుపెరుగని శ్రామికుడిలా ఉద్యమించారు. జనంలో ఒక్కడిగా జనం కోసం ఒక్కడిగా పోరాట స్పూర్తిని అందరిలో నింపారు. అయినప్పటికీ 2009 ఎన్నికల్లో కేసీఆర్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. ఇక అందరూ కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నారు. ఇక విశ్రమించక తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి రథసారధిలా ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 2014లో మళ్లీ ఎన్నిలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది టీఆర్ఎస్ పార్టీ. 2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ, 11 లోక్ సభ స్థానాలను సాధించి తెలంగాణ గడ్డమీద గులాబీ జెండా తొలిసారి ఎగురవేసింది. రాష్ట్రాలనికి సంక్షేమం విషయంలో ఏమి చేయాలనుకున్నాడో అవన్నీ మొదటి విడత పాలనలో అద్భుతంగా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్ళాడు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 87 అసెంబ్లీ, 9 పార్లమెంట్ సీట్లను తన ఖాతాలో వేసుకొని తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 2023-24 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా పార్టీ పేరును మార్చుకున్నారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది.

prajarajayam

  • ప్రజారాజ్యం చిరంజీవి

ఒకప్పటి సినిమా గ్లామర్ ని ఉపయోగించి రాజకీయాల్లో జండా పాతాలనుకుని 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ గాలి ముందు ప్రజారాజ్యం సూర్యుడు ఉదయించలేకపోయాడు. కేవలం 18 సీట్లకే పరిమితం అయ్యాడు. చాలా కాలం పాటూ పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసి రాజ్యసభ సభ్యునిగా కేంద్ర క్యాబినెట్లో మంత్రిపదవిని అధిరోహించారు. దీంతో ఆపార్టీకి ముగింపు కార్డు పడింది.

  • వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి

ఇదిలా ఉంటే సీఎం రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో సోనియాతో ఒక వ్యక్తిగత విషయమై మాటలు వచ్చాయి. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. ఓదార్పు యాత్ర పేరుతో నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఇంతలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడటంతో పాటూ ఏపీ అవశేష ఆం‌ధ్రప్రదేశ్ గా మారిపోయింది. అలా తిరుగుతున్న క్రమంలో 2009 ఎన్నికలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది అభ్యర్థులను బరిలోకి దింపింది జగన్ పార్టీ. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ముందు ఒక్క శాతం ఓట్ల తేడాతో పరాజయం రుచి చూసింది. 175 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం 60-70 స్థానాలకే పరిమితం అయ్యింది. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షం తీరును ఎండగడుతూ వచ్చాడు. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వని పక్షంలో ప్రజల్లోనే తేల్చుకుంటానని పాదయాత్ర చేశాడు. సుమారు 3648కిలో మీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను తెలుసుకోగలిగాడు. గతంలో ఉన్న నాయకత్వ లక్షణాలకు మరిన్ని జోడించుకొని సరికొత్త నాయకుడిలా ప్రజల నాయకుడిలా ఎదిగాడు. పార్టీ స్థాపించిన 9 సంవత్సరాలకు 2019లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలతో మొత్తం స్థానాలను ఊడ్చిపడేశాడు.

  • జనసేన పవన్ కళ్యాణ్

ఇదిలా ఉంటే వీటన్నింటి మధ్య గ్యాప్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తన సినిమా గ్లామర్ ను ఉపయోగించి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నాడు. ప్రజలకు సేవచేసేందుకు రాజకీయాల్లోకి రావాలని సంకల్పించాడు. అందుకే 2014 మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా అందర్లో జోష్ నింపారు. మొదటి ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలకు ప్రతిఒక్క యువకుడు పవన్ కి మద్దతు పలకాలనుకున్నాడు. అదే క్రమంలో పవన్ ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి పోరాటం చేసి నాయకుడిగా ఎదిగే రోజుల్లో సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి రాజకీయాలపై తన సమయాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తరువాత చాలా మంది పెద్ద పెద్ద పేరొందిన వ్యక్తులు జనసేనలో చేరేందుకు ఆసక్తికనబరిచారు. అలాగే కొంత కాలం చేసేటప్పడికి పవన్ లో ఏమైందో ఏమో మళ్లీ సినిమాల వైపుకు అడుగులు వేశారు. దీంతో కొంతమంది యువకుల్లో నమ్మకం కోల్పోయేలా చేసుకున్నాడు. అలా వెళుతున్న క్రమంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. తనకు ఉన్న ఓటు బ్యాంకు ఎంతో కొంత టీడీపీకి వెళ్లిపోయింది. పరోక్షంగా మద్దతు అంతగా రుచించలేదు ప్రజలకు. దీంతో చంద్రబాబు వ్యతిరేఖత పవన్ పై కూడా పడింది. అందుకే చంద్రబాబుకు దూరంగా ఉండటం ప్రారంభించారు. అలాగే 2019లో 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీలో ఉంటుందని చెప్పడం చెప్పినప్పటికీ ఆమాటపై నిలబడక పోవడం మరి కొంతమందిని నిరుత్సాహానికి గురిచేసింది.

నాయకుడు అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా ఉండాలే కానీ ఇలా పూటకో ఆలోచనలు, రోజుకో నిర్ణయాలు తీసుకునేలా ఉండకూడదు అనే ఉద్దేశ్యంలో యువకులు మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇంతటితో పోటీ చేయకున్నా, సినిమాలు చేసుకుంటూ ఉన్నా పెద్దగా నష్టం జరిగేది కాదు. ఎందుకంటే 2019 తరువాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ మొగ్గు చూపినట్లు అనిపించింది. దీనిని కొనసాగించి సింగల్ గా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకోగలిగితే బాగుండేది. అలా కాకుండా ప్రజలు 23 స్థానాలతో ఛీ కొట్టిన చంద్రబాబును మళ్లీ తిరిగి కలవడం అనేది ఈసారి తమ అభిమానుల్లోనే కొందరికి నచ్చలేదు. దీంతో జనసేన గ్రాఫ్ మరింత పడిపోయినట్లయ్యింది. మైలేజ్ పెరిగే క్రయంలో అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీ భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేసేలా కనిపిస్తుంది. గతంలో ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ‌్ గెలిచినా ఓడినా 25ఏళ్లపాటూ రాజకీయాల్లో ఉంటా అన్నారు. అంటే ఇతను చెప్పిన గడువులో 10 సంవత్సరాలు మరో రెండురోజుల్లో గడిచిపోతుంది. 11వ ఆవిర్భావ దినోత్సవం నుంచైనా స్వతంత్ర నిర్ణయాలను, స్వేచ్ఛగా ప్రజల్లో తిరిగే పరిస్థితులను కల్పించుకొని రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తారా లేక టీడీపీ, బీజేపీ అని పొత్తు రాజకీయాలవైపుకు పరుగులు తీస్తారా వేచిచూడాలి. గతంలో జరిగిన తప్పులు తిరిగి పునరావృతం కాకుండా చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించవచ్చు. అలాగే సినిమాలు, రాజకీయాలు అంటే అప్పట్లో నడిచేవేమోగానీ ఇప్పటి సమాజంలో అయితే కుదరదు అనే చెప్పాలి.

ఇప్పటి వరకూ పేర్కొన్న పార్టీలన్నీ ఒంటరిగా వెళ్లి తమ సత్తాను చూపించుకొని తిరిగి ప్రజల్లో బలాన్ని, నమ్మకాన్ని చోరగొన్నవే. ఇలా మద్దతు ఇస్తూ ఛీకొట్టిన పార్టీల వెనుక ప్రతిసారీ తిరుగుతూ తమను తాము చిన్నదిగా చేసి చూసుకోలేదు కనకనే అ‌ఖండ విజయాన్నైనా నెమ్మదిగా సాధించగలిగాయని చెప్పాలి. మరి పవన్ రేపటి నుంచైనా ఎలాంటి వ్యూహాలకు పదును పెడతారో వేచి చూడాలి.

 

T.V.SRIKAR