Pawan Kalyan: శ్యాంబాబు.. శాంపిల్ మాత్రమే.. ఉస్తాద్‌లో పేలనున్న పొలిటికల్ డైలాగ్స్..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పొలిటికల్ సెటైర్లు మాములుగా ఉండవని. దీంతో రచ్చ రచ్చ చెయ్యడానికి పవన్ అండ్ టీం రెడీ అవుతున్నారని అంటున్నారు.

Pawan Kalyan: బ్రో సినిమా లో శ్యామ్ బాబు పాత్ర పై రచ్చ మాములుగా జరగలేదు. ఈ పాత్ర విషయంలో అంబటి రాంబాబు చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. అది అయ్యి అవగానే ఇప్పుడు ఇంకో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పొలిటికల్ సెటైర్లు మాములుగా ఉండవని.
దీంతో రచ్చ రచ్చ చెయ్యడానికి పవన్ అండ్ టీం రెడీ అవుతున్నారని అంటున్నారు. అసలు హరీష్ శంకర్ రైటింగ్ లోనే ఒక సెటైర్ ఉంటుంది. గబ్బర్ సింగ్ మూవీ లో ప్రతి డైలాగ్ మాస్ తో డాన్స్ లు వేయించింది. రాజశేఖర్ జీవిత ల పై ఆ మూవీలో చేసిన ఇమిటేషన్ ఇప్పటికి పిచ్చ కామెడీ గా ఉంటుంది. అలాంటిది ప్రత్యేకంగా పొలిటికల్ లీడర్స్‌ను టార్గెట్ చేస్తే ఇంకెలా ఉంటుందో. వచ్చేది పొలిటికల్ సీజన్. ఎలక్షన్ ఫీవర్ ఫుల్ స్వింగ్‌లో ఉండే ఆ టైం లో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మార్క్ పొలిటికల్ సెటైర్స్ పడితే ఇంకా ఏముంటుంది? థియేటర్స్ లో కేకలే.
భీమ్లా నాయక్ చిత్రం లో పవన్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి థియేటర్స్ లో రీసౌండ్ వస్తూనే ఉన్నాయి. అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ లో ఈ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండొచ్చని, – పొలిటికల్ ప్రత్యర్థులను పివర్ స్టార్ చీల్చి చెండాడుతాడని ఆశిస్తున్నారు ఫాన్స్. ఒకవేళ నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో పొలిటికల్ డైలాగ్స్ ఉంటే మరింత రచ్చ జరగడం ఖాయం.