AP Elections : పీకే చెప్పినట్టే.. బాబు రూట్ మ్యాప్
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబుకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రూట్ మ్యాప్ రెడీ చేశారు. పీకే చెప్పినట్టే జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలను మొదలు పెడుతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబుకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రూట్ మ్యాప్ రెడీ చేశారు. పీకే చెప్పినట్టే జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలను మొదలు పెడుతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఈసారి తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇవ్వబోతున్నారు. కొన్నిరోజుల క్రితం పీకేను వెంటబెట్టుకొని ఉండవల్లికి వచ్చారు లోకేష్. తర్వాత బాబు-పీకే మధ్య మీటింగ్ జరిగింది. 2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు టీడీపీకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. అందులో భాగంగా 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలను నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేసింది. ఆ సభకు లక్ష మంది జనసమీకరణ చేయాలని చంద్రబాబుకి పీకే సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. జనవరి 4 నుంచి టీడీపీ చేపట్టనున్న జయహో బీసీ కార్యక్రమం కూడా పీకే చెప్పిందే అంటున్నారు.
జనవరి 5 నుంచి రాయలసీమలో మొదటి బహిరంగ సభను టీడీపీ నిర్వహిస్తోంది. రోజుకి ఒకటి లేదా రెండు సభలు జరిగే అవకాశముంది. బలహీనవర్గాలకు సంబంధించిన ప్రచార రథాలను రెడీ చేయాలని పీకే సూచించినట్టు సమాచారం. ఒక్కో పార్లమెంట్ స్థానానికి రెండు ప్రచార రథాలు ఉంటాయి. జనవరి నెలాఖరు కల్లా బహిరంగ సభల కాన్సెప్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత జనసే అధినేత పవన్ కల్యాణ్ తో కలసి తిరుపతిలో మేనిఫెస్టోని రిలీజ్ చేసే అవకాశముంది. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ హామీలను టీడీపీ ప్రకటించింది. నిరుద్యోగులకు 3వేల భృతి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి హామీలను ప్రకటించబోతున్నారు.
టీడీపీ అభ్యర్థుల జాబితా సంక్రాంతికల్లా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే పీకే స్ట్రాటజీ ప్రకారం ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అభ్యర్థుల విషయంలో పీకే సోషల్ ఇంజినీరింగ్ ను లెక్కలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆయన సలహా ఇచ్చిన ప్రకారమే టీడీపీలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. వైసీపీ అభ్యర్థుల జాబితా ఎలాగూ జనవరి మొదటివారంలోగా పూర్తవుతుందని భావిస్తున్నారు. వైసీపీ జాబితా రిలీజ్ అవ్వగానే.. ప్రతి నియోజకర్గం సమీక్ష చేసి.. జగన్ పార్టీ అభ్యర్థికి ధీటుగా టీడీపీ-జనసేన అలయన్స్ లో క్యాండిడేట్స్ ఎంపిక ఉంటుంది.
ఈసారి టీడీపీని అధికారంలోకి తేవడం అనేది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కి వెరీ టఫ్ జాబ్ గా మారనుంది. వైసీపీ కోసం గతంలో అనుసరించిన వ్యూహాలకు ఆపోజిట్ గా ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. బాబును కొత్తగా చూపించడానికి.. జనం దగ్గర మెప్పు తీసుకురావడానికి పీకేకి చాలా పెద్ద టాస్కే ఉంది. ఆయన చాలా వ్యూహాలను రెడీ చేయాల్సి ఉంది.