Prashant Kishor: నిన్ను నమ్మలేం బాస్‌.. ప్రశాంత్‌ కిషోర్‌ మాటలు జనం నమ్ముతారా..?

కానీ కొన్ని రోజుల నుంచి పీకే ఏది చెప్తాడో దానిక సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. రీసెంట్‌గా జరిగిన చాలా రాజకీయ పరిణామాలే దానికి ఉదాహరణ. తెలంగాణలో రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీకే.. బీఆర్ఎస్‌ గెలుస్తుంది అని చెప్పాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 05:55 PMLast Updated on: Mar 04, 2024 | 5:55 PM

Political Strategist Predictions Will Be Correct Here Is The Analysis

Prashant Kishor: ఇండియాలో నెంబర్‌ వన్‌ ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌ ఎవరూ అంటే.. అనుమానం లేకుండా అంతా చెప్పే పేరు ప్రశాంత్‌ కిషోర్‌. ఈయన ఏ పార్టీ కాంట్రాక్ట్‌ తీసుకుంటే ఆ పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తుంది అని ఆయనకు ఓ గుర్తింపు ఉంది. ఆయన చేసే పొలిటికల్‌ అనాలసిస్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ కొన్ని రోజుల నుంచి పీకే ఏది చెప్తాడో దానిక సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. రీసెంట్‌గా జరిగిన చాలా రాజకీయ పరిణామాలే దానికి ఉదాహరణ. తెలంగాణలో రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీకే.. బీఆర్ఎస్‌ గెలుస్తుంది అని చెప్పాడు.

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

నిజానికి బీఆర్‌ఎస్ పార్టీకి చాలా కాలం పాటు పీకే ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌గా పని చేశాడు. కానీ కొన్ని కారణాలతో కేసీఆర్‌కు, పీకేకు మధ్య గ్యాప్‌ వచ్చింది. దీంతో వదిలి వెళ్లిపోయాడు. బీఆర్‌ఎస్‌ను వదిలేసిన తరువాత కూడా అదే పార్టీ గెలవబోతోంది అని పీకే చెప్పడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కర్నాటక ఎన్నికలతో కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ వచ్చినా.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కునేంత బలంగా కాంగ్రెస్‌ ఇంకా లేదని చెప్పాడు పీకే. కానీ.. ఆయన ఏది చెప్పాడో దానికి వ్యతిరేకంగా జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి అధికారాన్ని చేపట్టింది. ఇక చాలా కాలం నుంచి పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న పీకే.. తాను అసలు పాలిటిక్స్‌లోకి రాను అని చెప్పాడు. ఎప్పటికీ రాజకీయ వ్యూహకర్తగానే ఉంటాను కానీ ఏ పార్టీలో చేరనంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కానీ ఆ తరువాత కొన్ని రోజులకే బిహార్‌కు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. దీంతో మరోసారి చెప్పేదొకటి చేసేదొకటి అనే పేరు తెచ్చుకున్నాడు. దాని తరువాత సొంత రాష్ట్రం బిహార్‌లో కూడా పీకే చేసిన అనాలసిస్‌ డిజాస్టర్‌ అయ్యింది. ఇండియా కూటమిలో నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా చేస్తే బెటర్‌ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ఇండియాకు వేరే ఆప్షన్‌ కూడా లేదని.. నితీష్‌ను పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. నితీష్‌కు ఆ కెపాసిటీ ఉందంటూ సర్టిఫికేట్‌ ఇచ్చాడు. కట్‌ చేస్తే నితీష్‌ వెళ్లి ఎన్డీలో చేరాడు. దీంతో పీకే పరువు మరోసారి పోయింది. ఇవన్నీ చూసిన తరువాత నెటిజన్స్‌ సైలెంట్‌గా ఉంటారా.. పీకేను ఏకేస్తున్నారు. ఎన్నో పార్టీలకు పొలిటికల్‌ స్ట్రాటజీలు ఇచ్చిన పీకే.. తన సొంత పార్టీకి మాత్రం ఇప్పటి వరకూ ఓ స్ట్రక్చర్‌ ఇవ్వలేకపోయాడు. అప్పట్లో ఓ పాదయాత్ర చేశాడు. అప్పటి నుంచి మళ్లీ సైలెంట్‌ ఐపోయాడు. ఇక ఆయన సర్వేలు చేయించే ఐప్యాక్‌ కూడా కేవలం సర్వే ఏజెన్సీగా మాత్రమే మిగిలిపోయింది. అలాంటి ఏజెన్సీలు ఇప్పుడు గల్లీకి ఒకటి ఉన్నాయి. దీంతో సైలెంట్‌గా సర్వేలు చేసుకోక ఈ పొలిటికల్‌ అనాలసిస్‌లు అవసరమా అంటున్నారు నెటిజన్స్‌.