హుస్నాబాద్ కు నిధుల వరద, నేనున్నా అంటూ పొన్నం భరోసా

గత పాలకులు నియోజకవర్గ డెవలప్ మెంట్ గాలికి వదిలేశారు. పదేళ్ల పాటు స్వరాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి...అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. ప్రజలు కష్టాలు పడుతున్నా...చూసి చూడనట్లు వదిలేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2024 | 09:10 PMLast Updated on: Nov 29, 2024 | 9:10 PM

Ponnam Special Focus On Development Of Husnabad Constituency

గత పాలకులు నియోజకవర్గ డెవలప్ మెంట్ గాలికి వదిలేశారు. పదేళ్ల పాటు స్వరాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి…అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. ప్రజలు కష్టాలు పడుతున్నా…చూసి చూడనట్లు వదిలేశారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా…సొంత జేబులు నింపుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కాలం చక్రం గిర్రున తిరిగింది. స్వరాష్ట్రం సిద్ధించినే పదేళ్ల తర్వాత…హుష్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో కళ్ల ముందు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే…నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. నాడెలా ఉండేది…నేడు ఎట్లుంది అంటూ పోల్చుతున్నారు. ఇదంతా మంత్రి పొన్నం ప్రభాకర్ చలువతోనే సాధ్యమైందని నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెబుతున్నారు.

బీఆర్ఎస్ పాలనకు…కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉందని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. విద్య, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా…ఆస్పత్రులు, విద్యాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులను ఒప్పించి…నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో పొన్నం ప్రభాకర్ సక్సెస్ అయ్యారు. తనను మంత్రి చేసిన నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా తక్కువేనంటారు. మిగిలిన నియోజకవర్గాలకు భిన్నంగా అభివృద్ధిలో ముందుండాలని నిత్యం శ్రమిస్తున్నారు. భల్లునాయక్ తండాకు చెందిన దేవికి సురభికి…వైద్య కళాశాలలో సీటు వచ్చింది. అమ్మాయి కుటుంబం ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుండటంతో…అనుచరుల ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు. సురభి కుటుంబానికి ఇంటికి పిలిపించి…అమ్మాయి కుటుంబానికి ధైర్యం చెప్పారు. లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇలా ఎంతో మందికి మూడో వ్యక్తికి తెలియకుండా సాయం చేశారు మంత్రి పొన్నం. తనకు ఉన్న దాంట్లో కొంత నలుగురికి పంచి పెట్టడానికి ఏ మాత్రం వెనుకంజ వేయరు.

ఎన్నికల ప్రచారంలోనే ఏ మండలంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి ? ఆస్పత్రుల పరిస్థితి ఏంటి ? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి ? వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలతో డాక్యుమెంట్ ను సిద్ధం చేసుకున్నారు. ఏ ప్రాంతంలో అయినా ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే తిండి, గుడ్డ ఒకటి ఉండే సరిపోదు. ఇవి ప్రాథమిక అవసరాలు. వీటికి తోడు మంచి విద్య, వైద్యం ఉండాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని పరి తపిస్తారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకే వీటినే ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి…మంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే…నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ చేశారు. హుస్నాబాద్ మండలంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని…250 పడకల ఆసుపత్రిగా మార్చడానికి రూ.82 కోట్లు నిధులను సాధించారు.

గతంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉండేది. జిల్లాల విభజనలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు…సిద్ధిపేట జిల్లాలో కలిశాయి. ఆయా మండలాల ప్రజలు వివిధ అవసరాలకు ఇప్పటికీ కరీంనగర్‌ వెళ్తారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నడుం బిగించారు. మంత్రి సూచనలతో ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ శాఖ ఇంజినీర్లు రూ.150 కోట్లతో ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి చిన్నముల్కనూరు, చిగురుమామిడి, సుందరగిరి, కొండాపూర్ మీదుగా హుస్నాబాద్ వరకు 24 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డును కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు ప్యాకేజీలుగా విభజించారు. రూ. 77 కోట్లతో ఒక భాగం, రూ.80 కోట్లతో మరో భాగం ఫోర్ లేన్ పనులు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంలో కొత్తపల్లి, చిన్నముల్కనూరు, చిగురుమామిడి, సుందరగిరి, కొండాపూర్ తదితర గ్రామాల్లో ప్రజల ఇళ్లకు ఎక్కువ నష్టం జరగకుండా బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హుస్నాబాద్‌-కొత్తపల్లి రహదారి నాలుగు వరుసలకు…మొదటి దశగా రూ.77.20కోట్లు మంజూరు చేయించుకున్నారు.

అక్కన్న పేట మండల కేంద్రంలో టీజీఐఐసీ ద్వారా 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు, హుస్నాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సాధించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వాయిపేటలో టూరిజం హబ్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి రూ. 37 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం రూ. 431 కోట్ల నిధులు తెచ్చుకున్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం సర్వాయిపేట, కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై పొన్నం ప్రభాకర్ ఫోకస్ చేశారు.