పేదల నాయకుడు పొన్నం ప్రజలతో మమేకం…ప్రజాశ్రేయస్సుకు అంకితం
తెలంగాణ కోసం ఉద్యమించారు..సొంత పార్టీతోనే విభేదించారు. ప్రజల ఆకాంక్షలను అధిష్ఠానానికి వినిపించారు. కాదంటే...పార్టీకి తీవ్రనష్టమేనని హెచ్చరించారు. నిత్యం ప్రజల్లో ఉండే ఆ సీనియర్ నేత...పదవుల కోసం పాకులాడలేదు. కష్టపడి పని చేశారు. ఫలితాన్ని అధిష్ఠానానికి వదిలేశారు.

తెలంగాణ కోసం ఉద్యమించారు..సొంత పార్టీతోనే విభేదించారు. ప్రజల ఆకాంక్షలను అధిష్ఠానానికి వినిపించారు. కాదంటే…పార్టీకి తీవ్రనష్టమేనని హెచ్చరించారు. నిత్యం ప్రజల్లో ఉండే ఆ సీనియర్ నేత…పదవుల కోసం పాకులాడలేదు. కష్టపడి పని చేశారు. ఫలితాన్ని అధిష్ఠానానికి వదిలేశారు. అందుకే ఆయన్ను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆయనే మంత్రి పొన్నం ప్రభాకర్.
పొన్నం ప్రభాకర్…తెలంగాణ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బీసీ బిడ్డ. విద్యార్థి నేతగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాణిస్తున్నారు. ఏ పదవిలో ఉన్నా నమ్మిన సిద్ధాంతాలను మరచిపోలేదు. ఎత్తుకున్నా జెండాను వదిలిపెట్టలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా….ఒదిగి ఉంటారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంపీగా పని చేసినా…తాజాగా మంత్రి అయినా…ఎన్నడు అధికార దర్పం ప్రదర్శించలేదు. నలుగురిలో ఒకడిగా కలిసిపోతారు. ఏ చిన్న అవకాశం దొరికినా…నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇష్టపడుతారు. పేదల కష్టసుఖాలను తెలుసుకుంటారు. ఏ సమయంలో అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయం కోరి వచ్చినా…కష్టాలు ఉన్న వారు ఆశ్రయించినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారు. అధికారిక కార్యక్రమాలు లేకపోతే…ఎక్కువ సమయం హుస్నాబాద్ ప్రజలతో గడపడానికి మొగ్గు చూపుతారు. నియోజకవర్గంలోని ప్రజలు కూడా పొన్నంను…సొంత సోదురుడిలా భావిస్తారు.
2009లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన పొన్నం….విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ తో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడి, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. విద్యార్థి ఉద్యమాలతో కాంగ్రెస్ అగ్రనేతలకు దగ్గరయ్యాడు. ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. పొన్నం నాయకత్వ లక్షణాలను గుర్తించిన మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి…2009లో పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని పొన్నం ప్రభాకర్ ఏ మాత్రం వదులుకోలేదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరిగారు. అన్ని గ్రామాల్లో తనకంటూ ప్రత్యేకంగా అనుచరులు తయారు చేసుకున్నారు. స్వరాష్ట్రం కోసం కాంగ్రెస్ నాయకత్వంతోనే విభేదించారు. తెలంగాణ కోసం ఢిల్లీలో పోరాటం చేశారు. పార్టీ ఎంపీలను ముందుండి నడిపించారు. ఎన్నో త్యాగాలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.
వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలయిన పొన్నం ప్రభాకర్…ఏనాడు ప్రజల నుంచి దూరం కాలేదు. ప్రజల మధ్యే గడిపారు. ప్రజలతోనే మమేకమై…వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికపుడు ఎత్తి చూపారు. 2023లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. హుస్నాబాద్ నుంచి స్థానంలో గెలుపొంది…రేవంత్ రెడ్డి కేబినెట్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖల బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయ్యానని ఏనాడు తలకెక్కించుకోలేదు. ఎంపీ అయినా…మంత్రి అయినా…అదంతా ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైన వినమ్రంగా చెప్పుకుంటారు. పదవులు వచ్చాయని పొంగి పోలేదు…రాలేదని నిరుత్సాహ పడలేదు. కస్టపడి పని చేస్తే పదవులు…వాటంతటవే వస్తాయని నమ్మే వ్యక్తి పొన్నం ప్రభాకర్.