బీసీ సంక్షేమ శాఖపై పొన్నం పట్టు, మెస్ చార్జీల పెంపు చారిత్రాత్మకం
ఏ పని చేసినా...వందశాతం ఎఫెక్ట్ కొందరు నేతలు. ఎందులోనూ రాజీపడరు. నిత్యం పేదల కోసం ఆలోచించే నేతలు...నూటికొకరు ఉంటారు. అలాంటి నేతల కోవలోకే వస్తారు పొన్నం ప్రభాకర్. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా దూకుడుగా వ్యవహరిస్తూనే...ఆ వర్గాలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు.
ఏ పని చేసినా…వందశాతం ఎఫెక్ట్ కొందరు నేతలు. ఎందులోనూ రాజీపడరు. నిత్యం పేదల కోసం ఆలోచించే నేతలు…నూటికొకరు ఉంటారు. అలాంటి నేతల కోవలోకే వస్తారు పొన్నం ప్రభాకర్. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా దూకుడుగా వ్యవహరిస్తూనే…ఆ వర్గాలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు.
బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్…ఆ శాఖపై పూర్తిగా పట్టు సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల గురించి చెప్పుకోవాల్సి వస్తే…ఆయన మొదట వరుసలో ఉంటారు. స్వతహాగా వెనుకబడిన వర్గాలకు చెందిన పొన్నం…ఆ వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. ఏ పని చేసినా…పది మందికి ఉపయోగపడాలనే రీతిలో…తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఏ యే కులాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలి ? వారికి ఎందులో సాయం చేయాలి ? ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటి ? కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు…ప్రజలకు చేరుతున్నాయో లేదో నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వెనుకబడిన వర్గాల జనం సమావేశాల్లోనూ సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహరించడం అంటే…ఆ వర్గాలను ఉన్నతంగా తీర్ఛిదిద్దాలన్నదే పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా కనిపిస్తోంది. అమాత్యుడిగా ఉన్నా ఆడంబరాలకు పోకుండా…సామాన్య కార్యకర్తలానే కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు. ఎప్పటికపుడు శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే…దిశానిర్దేశం చేస్తున్నారు.
సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచడం మాములు అంశం కాదు. విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాలన్న డిమాండ్ పెద్దగా లేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత పటిష్ఠంగా లేకపోయినా…ఎలాంటి చర్చ లేకుండా దాదాపు 40 శాతానికి పైగా పెంచారు. హాస్టల్స్‌లో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఆయా వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం పొన్నం ప్రభాకర్ ఆలోచించడం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే ఇలాంటి అంశంలో మాత్రం గత సర్కారు దయచూపలేదు. విద్యా రంగానికి చేసే ఖర్చును…భారంగా భావించకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా చూస్తోంది. ఏడేళ్లుగా డైట్ చార్జీలు… 16 ఏళ్లుగా కాస్మొటిక్ చార్జీలు పెంచలేదు అంటే గత ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా…తన మార్కును చూపిస్తున్నారు పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో 1029 గురుకులాల్లో 1.50 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. గురుకులాల్లో NCC, NSS, నీట్ కోచింగ్ ఇచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తూనే…ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ విద్యార్థులు అన్నింట్లోనూ వెనుకబడితే…కాంగ్రెస్ పాలనలో ముందడుగు వేస్తున్నారు. అన్నీ గురుకులాల్లో ప్యూరిపైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రెసిడెన్షియల్ స్టూడెంట్ల మెస్ చార్జీల పెంచడంలో కీలకపాత్ర పోషించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు 5000 కోట్లు కేటాయించేలా…ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను ఒప్పించారు.
రాష్ట్రంలోని 25 వేల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 1100 కోట్లు, స్కూల్స్‌కు ఉచిత విద్యుత్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ సిబ్బందికి జీతాలపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 19 వేల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 35 వేల ఉపాధ్యాయుల బదిలీలు, డీఎస్సీ ద్వారా 10 వేల మందికి నియామక పత్రాలు అందించడం చారిత్రాత్మక నిర్ణయంగా భావించవచ్చు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం కోసం 5వేల కోట్లు సాధించడంలో పొన్నం ప్రభాకర్ సక్సెస్ అయ్యారు. మహాత్మ జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని…గతంలో 300 మందికి మాత్రమే ఇచ్చారు. ఈ సారి దాన్ని మూడింతలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయించడంలో పొన్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సామాజిక విప్లవం దిశగా ముందడుగు పడింది.