Poonam Kaur: అలాంటి నాయకులతో జాగ్రత్తగా ఉండండి.. పూనమ్ కౌర్ ట్వీట్ ఎవరికోసం..?
‘‘ఏపీలో మహిళల సమస్యలపై కొందరు నేతలు గొంతు చించుకుని అరుస్తున్నారు. నిజంగా వాళ్లకు మహిళల సమస్యలపై అంత ఆవేదన ఉంటే రెజ్లర్ల నిరసన గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. వాళ్ల అవసరాలు, ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడే మోసపూరిత నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి’’ అని పూనమ్ ట్వీట్ చేశారు

Poonam Kaur: సినిమాలకన్నా వివాదాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్న నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలనం రేపారు. ఏపీ నాయకుల గురించి పూనమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్‌లో నాయకుల పేరు ప్రస్తావించకున్నా.. ఆమె ఎవరిని టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసిందో సులభంగా అర్థమవుతుంది.
‘‘ఏపీలో మహిళల సమస్యలపై కొందరు నేతలు గొంతు చించుకుని అరుస్తున్నారు. నిజంగా వాళ్లకు మహిళల సమస్యలపై అంత ఆవేదన ఉంటే రెజ్లర్ల నిరసన గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. వాళ్ల అవసరాలు, ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడే మోసపూరిత నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి’’ అని పూనమ్ ట్వీట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రస్తావించారు. దీనర్థం ఆమె ట్వీట్ చేసింది ఏపీలోని నాయకుల గురించే అని స్పష్టమవుతోంది. ఇటీవల ఏపీలో మిస్సవుతున్న మహిళల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. దీంతో పూనమ్ ట్వీట్ చేసింది పవన్ కళ్యాణ్ గురించే అని నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు పవన్ గురించి పేరు ప్రస్తావించకుండా పూనమ్ పలు ట్వీట్లు, వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం గురూజీ అంటూ ప్రస్తావిస్తూ మరో ట్వీట్ కూడా చేశారు.
ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్‌ను గురూజీ అంటారు అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ వరుసగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ.. పరోక్షంగా ట్వీట్లు చేయడం సంచలనంగా మారింది. ఆమె ట్వీట్ల వెనుక ఉన్న అసలు కారణాలు ఏవైనా.. అవి రాజకీయంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. పవన్ ప్రత్యర్థులు పదేపదే వాటిని, పూనమ్ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం పూనమ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు.