మా అమ్మ మీద ఒట్టు, రాజకీయాలకు గుడ్ బై: పోసాని
ఏపీలో రెడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల గురించి మాట్లాడటం గాని రాజకీయాల్లో ఉండటం గాని చేయను అంటూ... గుడ్ బై చెప్పారు.
ఏపీలో రెడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల గురించి మాట్లాడటం గాని రాజకీయాల్లో ఉండటం గాని చేయను అంటూ… గుడ్ బై చెప్పారు. జగన్ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్న పోసాని… ఎంపీ, ఎమ్మెల్యే కంటే తనకే ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది అని తెలిపారు. తాను రాజకీయాలు మాట్లాడితే తిక్క కోపం అనుకుంటారు గాని… మంచి నాయకులను ఎప్పుడు విమర్శించలేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ సిఎం నవీన్ పట్నాయక్ వంటి గొప్ప నాయకులను ఎప్పుడూ విమర్శించలేదని తెలిపారు. చంద్రబాబు, జగన్ , లోకేష్ వారి గుణగణాలను బట్టి మాత్రమే విమర్శించానని పేర్కొన్నారు. నా మనస్సాక్షి గా, నా తల్లి తండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఎవర్ని కావాలని విమర్శించలేదని తెలిపారు. కేవలం తాను ఒక ఓటర్ గా మాత్రమే ప్రవర్తించానని చెప్పుకొచ్చారు.
నా కుటుంబంకోసం, నా బిడ్డల కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి నేను చచ్చిపోయెంత వరకు రాజకీయాలు మాట్లాడనని ప్రమాణం చేసారు. తన ముఖం తనకు అంద వికారంగా కనపడుతోంది అన్నారు. జగన్ గారు l love you. నేను ఏం అడిగినా ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ కోసం నేను చాలా చేశానని కాని పోసాని కేసులకు భయపడడు అన్నారు. తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నా అన్నారు పోసాని.