పోసాని ఖైదీ నంబర్ 2261 టోటల్ 11, ఆడుకుంటున్న టీడీపీ
టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలపై అలాగే దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు...

టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలపై అలాగే దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు… ఇటీవల హైదరాబాద్ లోనే ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. పోసాని కృష్ణ మురళిని గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు 9 గంటల పాటు పోలీసులు విచారించారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారించిన పోలీసులు.. అక్కడి నుంచి నిన్న రాత్రి 9:30 గంటలకు పోలీసులు రైల్వే కోడూరులోని.. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. అక్కడ రాత్రి 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపాక్షాల మధ్య వాదనలు కొనసాగాయి. అదే సమయంలో పోలీసులు కోర్ట్ లో రిమాండ్ రిపోర్టును కూడా సమర్పించారు. ఇక పోసాని కృష్ణమురళిని 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు పోసాని తరఫున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరై ఆయనను ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ఇక పోసాని తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. దీనితో పోసానికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. పోసాని కృష్ణ మురళి మార్చి 13 వరకు రిమాండ్ లోనే ఉన్నారు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. పోసాని తన మాటలతో కులాల మధ్య చిచ్చుపెట్టారని అభియోగాలను మోపారు పోలీసులు.
అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన కుటుంబం పై నోటికి వచ్చినట్లు దూషించారని రిమైండర్ రిపోర్ట్ లో పోలీసులు ప్రస్తావించారు. అక్కడితో ఆగకుండా ఆయన నంది అవార్డుల కమిటీపై కూడా కులం పేరుతో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇక పోసాని కృష్ణ మురళికి జైలులో 2261 ఖైదీ నెంబర్ ను కేటాయించారు పోలీసులు. అయితే ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు టిడిపి కార్యకర్తలు. 2261ను కాలిక్యులేట్ చేస్తే మొత్తం 11 వస్తుందని.. పోసాని కృష్ణ మురళి జీవితం కూడా 11తోనే ఎండ్ అయిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామన్నారు. ఇక వైసిపి న్యాయ విభాగం కూడా పోసాని కృష్ణ మురళి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది.