ఐకాన్ స్టార్ అరెస్ట్ పై పవర్ స్టార్ ట్వీట్ వైరల్, అసలు ఏం జరుగుతుంది రా…?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో సినిమా పరిశ్రమ మొత్తం ఒక దెబ్బకు షాక్ అయింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో సినిమా పరిశ్రమ మొత్తం ఒక దెబ్బకు షాక్ అయింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత అల్లు అర్జున్ కు బెయిల్ రాకపోతే అక్కడ నుంచి చంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంపై సినీ, రాజకీయ ప్రముఖులు అందరు స్పందిస్తున్నారు. ఇక తమ సినిమా షూటింగ్లను రద్దు చేసుకుని మెగా హీరోలందరూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. చిరంజీవి, నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం బెయిల్ కోసం లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తే కచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇందులో తన జోక్యం ఏమీ లేదని చట్టం అందరికీ సమానమే అన్నారు. తొక్కేసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసుల చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పుష్ప 2 విడుదల రోజున సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించింది కాబట్టే పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని, చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుందంటూ కామెంట్స్ చేశారు. ఇక దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఒక పోస్ట్ చేశారు. కలిసి ఉంటే నిలబడతాం… విడిపోతే పడిపోతాం అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ ని పవన్ కళ్యాణ్ షేర్ చేయడంతో ఇప్పుడు అది హాట్ టాపిక్ అవుతుంది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ గత కొంతకాలంగా విభేదిస్తూ దూరంగా ఉంటున్నాడు. పుష్ప సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని దగ్గరకు రానివ్వలేదు. ఈ తరుణంలో అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసుల అరెస్టు చేయడం దానిపై పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా స్పందించడంతో అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అంటూ అందరూ షాక్ అవుతున్నారు.
అల్లు అర్జున్ దాదాపుగా చంచలగూడ జైలుకు తరలించే అవకాశం ఉండవచ్చునే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ఇప్పుడు ఒక పర్మిషన్ లెటర్ ను సంధ్య థియేటర్ యాజమాన్యం బయటపెట్టింది. పుష్ప-2 సినిమా యూనిట్ తమ థియేటర్ వద్దకు 4వ తేదీ 9:30pm కు వస్తున్నారని… బందోబస్త్ ఎర్పాటు చేయాలని చిక్కడపల్లి పోలీసులను 2వ తేదీనే సంధ్య70m.m యాజమాన్యం కోరింది.