పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్, మూసుకుంటే మంచిదన్న మంచు విష్ణూ

తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. పవిత్రమైన ప్రముఖ ఆలయంలో ఈ విధమైన చర్యలు జరగడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఉన్న హిందువులందరూ ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదం పట్ల ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2024 | 02:55 PMLast Updated on: Sep 21, 2024 | 2:55 PM

Prakash Raj Counter To Pawan

తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. పవిత్రమైన ప్రముఖ ఆలయంలో ఈ విధమైన చర్యలు జరగడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఉన్న హిందువులందరూ ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదం పట్ల ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో కూడా దీనిపై యుద్ధమే జరుగుతోంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేయగా దానిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ఆయన పోస్ట్ చేసారు.

డియర్ పవన్ కళ్యాణ్ గారు…మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది అని… దయచేసి తక్షణం దర్యాప్తు చేయండి.. దోషులు ఎవరో కనుక్కుని కఠిన చర్యలు తీసుకోండని డిమాండ్ చేసారు. మీరు ఎందుకు లేనిపోని ఊహాగానాలు, ఆందోళనలు వ్యాపింపజేస్తున్నారు , సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు అని విమర్శించారు. దేశంలో మనకు కావలిసినన్ని మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి… కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రకాష్ రాజ్ కు ఎక్స్ లో మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు.

శ్రీ ప్రకాశ్ రాజ్ గారు , దయచేసి మీరు కామ్ గా ఉంటే మంచిది అని హితవు పలికారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ క్లారిటీ ఇచ్చారు. అటువంటి పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం శ్రీ @పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారున్నారు. మీరు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మతపరమైన రంగు ఎక్కడ యాడ్ చేసారో చెప్తారా అంటూ నిలదీశారు. ఇక ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 320 రూపాయలకు ఆవు నెయ్యి ఏ విధంగా కొంటారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. కచ్చితంగా ఆవు నెయ్యి కాదని దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ లు వ్యక్తమవుతున్నాయి.