ఇది సినిమా కాదు.. పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.. గట్టిగానే కెలికాడు..!
సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటే అది స్క్రిప్ట్. కానీ అదే బయట కూడా కంటిన్యూ అయితే చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యలో ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి.

సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటే అది స్క్రిప్ట్. కానీ అదే బయట కూడా కంటిన్యూ అయితే చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యలో ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. నిజానికి ప్రకాష్ రాజ్ మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడు పెద్దగా కామెంట్ చేసింది లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనను కనీసం పట్టించుకోడు కూడా. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఆయనను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఎందుకో తెలియదు కానీ ఇద్దరి మధ్య రాజకీయపరంగా చాలా విభేదాలు ఉన్నాయి. డే 1 మంచి బిజెపి అంటే ప్రకాష్ రాజ్ కు పడదు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటాడు.
ఇక బిజెపికి సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా కాస్త గుర్రుగానే ఉంటాడు ప్రకాష్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు పేచీ పెడుతూ ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఆయన మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రజలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాను అని చాలాసార్లు చెప్పాడు. నేను కూడా ఆ స్పీచ్ లకు ఫ్యాన్ అయిపోయాను అంటూ మొదలు పెట్టిన ప్రకాష్.. గెలిచిన తర్వాత మాత్రం ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాస్త అప్పుడప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచించాలి అంటూ పవన్ కు హితబోధ చేశాడు ప్రకాష్ రాజ్. గెలిచేంతవరకు ప్రజా సమస్యల గురించి మాట్లాడి గెలిచిన తర్వాత అసలు పట్టించుకోకపోవడం మంచిది కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏది పడితే అది మాట్లాడడానికి ఇది సినిమా కాదు అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశాడు ప్రకాష్ రాజ్. ఆయన వ్యాఖ్యలపై పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు.
మీ సొంత ఏజెండాను తీసుకొచ్చి పవన్ మీద రుద్దొద్దు.. ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలుసు మీరు వచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటూ ప్రకాష్ రాజ్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఏదో పవన్ ను నాలుగు మాటలు అంటే వార్తల్లో ఉంటాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఇక్కడ పడరు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు జనసైనికులు. అయినా పవన్ పై ఇలా ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడం ఇది మొదటిసారి కాదు. జనసేన ఆవిర్భావ సభలో హిందీ భాష గురించి మాట్లాడినప్పుడు మీ హిందీ భాష మా మీద రుద్దకండి అంటూ స్పందించాడు ప్రకాష్. అలాగే దానికి ముందు కూడా లడ్డు వివాదంపై ఇంకాస్త ఎక్కువే కాంట్రవర్సీ చేశాడు ఈయన. ఇలా పవన్ ఏ విషయం గురించి మాట్లాడినా కూడా వెంటనే ప్రకాష్ రాజ్ కూడా సీన్లోకి వస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య సినిమాల్లో ఎలాంటి వైరం అయితే ఉంటుందో బయట కూడా అదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే అక్కడ స్క్రిప్ట్ పరంగా కొట్టుకుంటున్నారు.. ఇక్కడ రాజకీయ పరంగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరి ఈ వైరాన్ని ఎవరు తగ్గిస్తారో చూడాలి..!