PRASHANT KISHOR: పొత్తు ఎలా కుదిరింది.. టీడీపీని పీకేను కలిపింది ఎవరు..?
గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు టీడీపీ వైపు ఎలా తిరిగారు..? అసలు టీడీపీకి, ప్రశాంత్ కిషోర్‌కు మధ్య దోస్తీ కుదిరేలా చేసింది ఎవరు..?
PRASHANT KISHOR: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. హైదరాబాద్ నుంచి ఒకే ఫ్లైట్‌లో గన్నవరం చేరుకున్న లోకేష్, పీకే ఇద్దరూ.. ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. దాదాపు 3గంటల పాటు చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ భేటీ జరిగింది. ఈ భేటీ తరువాత ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Revanth Reddy: డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన.. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు
అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు టీడీపీ వైపు ఎలా తిరిగారు..? అసలు టీడీపీకి, ప్రశాంత్ కిషోర్‌కు మధ్య దోస్తీ కుదిరేలా చేసింది ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ కిషోర్.. టీడీపీ కోసం పని చేసేలా స్వయంగా నారా లోకేష్ ఆయనను ఒప్పించారట. చంద్రబాబు బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లిన లోకేష్‌ను ప్రశాంత్ కిశోర్ కలిశారట. చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లి యాత్ర చేస్తే బెటర్ అనే ఐడియా కూడా పీకే ఇచ్చిందేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైసీపీకి, ప్రశాంత్ కిషోర్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ను గమనించిన లోకేష్.. తనకున్న పరిచయాలతో ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించారట.
టీడీపీ కోసం పని చేసేందుకు రావాలని పీకేను అడిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు చేసిన తరువాత.. చంద్రబాబును కలిసేందుకు పీకే ఒప్పుకున్నారట. ఆ తరువాతే ఇద్దరూ కలిసి నేరుగా ఉండవల్లి ఇంట్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు టీడీపీ కోసం పని చేస్తున్న రాబిన్ శర్మ కూడా ఒకప్పుడు పీకే టీంలో పని చేసిన వ్యక్తే. వచ్చే ఎన్నికల్లో రాబిన్ శర్మ టీంను ప్రశాంత్ కిషోర్ లీడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పీకే.. చంద్రబాబు పక్కన చేరడంతో వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఏకంగా మంత్రులు, మాజీ మంత్రులు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికే పీకేతో పని చేసిన అనుభవం ఉన్న వైసీసీ.. ఇప్పుడు పీకే వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పీకే చేరికతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.