PRASHANT KISHOR: టీడీపీలో పీకే బాధ్యతలు అవే.. లోకేశ్‌ ప్లాన్‌ మాములుగా లేదుగా..

ఊరికే కలవరు మహానుభావులు అన్నట్లు.. పీకే, చంద్రబాబు మీటింగ్ ఏంటి.. ఎందుకు అనే అనుమానాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్. బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పీకే.. లోకేష్‌ పిలిపించి మరీ.. చంద్రబాబు ఆయనను ఎందుకు రప్పించారా అనే చర్చ ఇంకా వినిపిస్తూనే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2024 | 04:03 PMLast Updated on: Jan 10, 2024 | 4:03 PM

Prashanth Kishore Role In Tdp Is Crucial For Party

PRASHANT KISHOR: రాబోయే అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. ఈసారి అధికారం మిస్ అయితే.. పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. చంద్రబాబుకు ఈ విషయం పక్కాగా తెలుసు! తన విషయంలో కాదు.. ఈసారి అధికారం రాకపోతే.. లోకేశ్‌ విషయంలోనూ మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందనే చర్చ కూడా ఉంది. గెలుపు కోసం ఎంత దూరం అయినా వెళ్తా అన్నట్లుగా.. చంద్రబాబు అడుగులు కనిపిస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ మధ్య ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు భేటీ కావడం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు.

JANASENA: గుర్తుల మీద పడ్డారేంటి బాబో! జనసేన గ్లాసు గుర్తు పోతుందా..?

ఈ మీటింగ్ మీద.. వైసీపీ గుప్పించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు బందిపోటు, సైబర్ క్రిమినల్, అరాచకవాది అని దుమ్మెత్తిపోసిన ప్రశాంత్ కిషోర్‌తోనే.. చంద్రబాబు భేటీ అవడం ఏంటి అంటూ.. ఫ్యాన్‌ పార్టీ నేతలు నిలదీశారు కూడా ! ఐతే పీకే, చంద్రబాబు భేటీలో ఏం జరిగింది.. భేటీ వెనక ఏముంది.. అసలు ఏం చర్చించుకున్నారు అన్నది ఇప్పటికీ ప్రశ్నలాగే ఉంది. ఊరికే కలవరు మహానుభావులు అన్నట్లు.. పీకే, చంద్రబాబు మీటింగ్ ఏంటి.. ఎందుకు అనే అనుమానాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్. బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పీకే.. లోకేష్‌ పిలిపించి మరీ.. చంద్రబాబు ఆయనను ఎందుకు రప్పించారా అనే చర్చ ఇంకా వినిపిస్తూనే ఉంది. పోనీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తారా అంటే.. ఆల్రెడీ రాబిన్‌శర్మ సైకిల్ పార్టీ స్ట్రాటజిస్ట్‌గా ఉన్నారు. మరి ఎందుకు పీకేను పిలిపించుకున్నారనే చర్చ చాలామందిలో అయోమయం రేపుతున్న వేళ.. ఇప్పుడో ప్రచారం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

రాబిన్‌ శర్మ రిపోర్టులను.. క్రాస్ చెక్ చేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, సామాజికవర్గాల బలంలాంటి అంశాలపై ఇప్పటికే రాబిన్‌ శర్మ.. తన నివేదికను చంద్రబాబుకు ఇచ్చారని తెలుస్తోంది. ఈ రిపోర్టును ప్రశాంత్‌ కిషోర్‌.. తన టీమ్‌తో క్రాస్ చెక్ చేయిస్తున్నట్లు టాక్. అవసరం అయిన చోట్ల మార్పులు చేర్పులు సూచిస్తున్నారట. ఇక అటు లోకేష్‌ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను కూడా ప్రశాంత్ కిషోర్‌ మీదే మోపారట చంద్రబాబు. ఇప్పుడీ ప్రచారం.. ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకత్వ పర్యవేక్షణ చూశాం కానీ.. ఈ సర్వేల పర్యవేక్షణ ఏంటి గురూ అంటూ కామెంట్లు పెడుతున్నారు చాలామంది ట్విట్టర్‌లో !