బ్రేకింగ్: చంపొద్దని ప్రాధేయపడ్డా వినలేదు, ప్రవీణ్ మృతి కేసులో సంచలనం
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నా.. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు, కొన్ని రోజులుగా ప్రవీణ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇది నార్మల్ డెత్ అనిపించడంలేదు అంటున్నారు ప్రవీణ్ సన్నిహితులు.

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నా.. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు, కొన్ని రోజులుగా ప్రవీణ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇది నార్మల్ డెత్ అనిపించడంలేదు అంటున్నారు ప్రవీణ్ సన్నిహితులు. రెండు నెలల క్రితం ఇస్లాం గురించి కొన్ని కామెంట్స్ చేశాడంటూ ప్రవీణ్‌ను కొందరు వ్యక్తులు టార్గెట్ చేశారు.
ప్రవీణ్‌ను చంపేస్తామంటూ బెదిరించారు. తనను చంపొద్దని ప్రాధేయపడుతూ ప్రవీణ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అయినా బెదిరింపుల ఆగకపోవడంతో తానే స్వయంగా క్షమాపణ చెప్తూ ఓ వీడియో కూడా షూట్ చేశారు. ఇది జరిగిన కొన్ని వారాలకే ప్రవీణ్ చనిపోయారు. దీంతో వాళ్లే ప్రవీణ్‌ను హత్య చేశారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ సీసీ ఫుటేజ్ సేకరించిన పోలీసులు మాత్రం ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప ఈ కేసులో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు.