President Of India: యుద్ధవిమానంలో రాష్ట్రపతి ప్రయాణం వైరల్ అవుతోన్న ద్రౌపది ముర్ము ఫొటోలు..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. చీరకట్టులోనే దర్శనం ఇస్తుంటారు. ఐతే ఇప్పుడు చీరకు బదులు.. పైలెట్ డ్రెస్ వేసుకొని భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ఎక్కారు. అందులో ప్రయాణం చేశారు రాష్ట్రపతి ముర్ము. ఆమె మొదటిసారి పైలెట్‌గా కనిపించారు.
అస్సోలం పర్యటించిన ముర్ము.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలెట్ దుస్తుల్లో తేజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కనిపించి అందర్ని ఆశ్చర్యపరిచారు. త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ రాష్ట్రపతి. అందుకే అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో యుద్ధ విమానం సుఖోయ్‌లో ప్రయాణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాష్ట్రపతి ముర్ము ప్రయాణించిన సుఖోయ్ విమానం స్టేషన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం సుఖోయ్‌లో ప్రయాణించిన భారత రెండవ మహిళా రాష్ట్రపతిగా నిలిచారు ద్రౌపది ముర్ము. మొదటిసారి మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సుఖోయ్‌లో ప్రయాణించారు.
ప్రతిభా పాటిల్ 2009లో పూణె ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి సుఖోయ్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. ఇప్పుడు ద్రౌవది ముర్ము అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా తయారు చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా లైసెన్స్‌తో నిర్మించారు. రాష్ట్రపతి తొలిసారిగా యుద్ధ విమానం సుఖోయ్‌లో ప్రయాణం చేసిన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన పైలట్స్, తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సిబ్బందితో ఫోటోలు దిగారు. మేడమ్‌కు అక్కడి అధికారులు వారి మోడ్ ఆఫ్ ఆపరేషన్ గురించి వివరించారు.