Narendra Modi : బీఆర్ఎస్, ఎంఐఎంను.. తోలుబొమ్మల్లా ఆడిస్తున్న మోదీ..
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని ఫిక్స్ అయింది.
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని ఫిక్స్ అయింది. తమ బలం పెంచుకుంటూనే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ముందుకొచ్చినా కలిసి నడిచేందుకు సిద్ధం అవుతోంది. ఇక అటు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ఒకసారి.. బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని మరోసారి.. రకరకాలుగా వినూత్న ప్రచారాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. కారు, కమలం ఒక్కటే అని చెప్తూ వెరైటీ పెళ్లి కార్డు సోషల్‌మీడియాలో వైరల్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీని టార్గెట్ చేస్తూ మరో కొత్త ప్రచారం మొదలుపెట్టింది. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీ చేతిలో తోలు బొమ్మలని.. తెలంగాణలో మోదీ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ తోలుబోమ్మలతో వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది.
Election Affidavits : బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన అఫిడవిట్లు
బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (MIM) లను బీజేపీ చేతిలో కీలుబోమ్మలని తెలియజేసేలా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీని ప్రతిబింబించేలా తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ లను తోలుబొమ్మల్లా ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రచారం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రతీ ఓటు అమూల్యమే అనే రేంజ్‌లో పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయ్. ఈ విషయంలో కాంగ్రెస్ మరో అడుగు ముందే ఉన్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు.. సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తోంది. నిన్న బీఆర్ఎస్, బీజేపీ పెళ్లి కార్డు అని ప్రచారం చేసినా.. ఇప్పుడు మోదీ చేతిలో రెండు పార్టీలు తోలుబొమ్మలు అని అంటున్నా.. కాంగ్రెస్ ఆలోచనలు అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియా జనాలు.