Modi Tour : తెలంగాణలో ప్రధాని పర్యటన.. 3 రోజులు, 6 సభలు.. ఈ నియోజకవర్గాల్లో మోదీ రోడ్ షో..
తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ప్రధాని మోదీ.. తాజాగా మరో సారి తెలంగాణ లో పర్యటించనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు.

Prime Minister's visit to Telangana.. Modi's road show in these constituencies..
తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ప్రధాని మోదీ.. తాజాగా మరో సారి తెలంగాణ లో పర్యటించనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యా హ్నం బెంగళూరు నుంచి కామారెడ్డికి చేరుకొని మధ్యాహ్నం 2:15 గంటలకు హెలికాప్టర్ లో అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.10 గంటలకు మహేశ్వరం వెళ్లనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.
Telangana Elections : సీఎం కేసీఆర్ కు.. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండో బహిరంగ లేఖ
ఆదివారం ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:45 గంటలకు నిర్మల్‌లో పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకొని అక్కడి శ్రీరచన రెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ వేంకటేశ్వర్వస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు మహబూబాబాద్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నాక హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్‌లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 5 గంటల్నించి 6 గంటల వరకూ అదే రోజు సాయంత్రం రాత్రి 7:00 గంటలకు ఢిల్లీకు బయలుదేరుతారు.