వలస నేతలకు ప్రాధాన్యత… టి.డి.జనార్దన్ పై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం!
వైసీపీ నుండి కొందరు నేతలు టీడీపీ లో చేరిన తర్వాత, వారికి అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారిని సులభంగా కలిసే అవకాశాలు లభిస్తున్నాయి. వీరు నెలకు 3-4 సార్లు నాయకులను కలుస్తున్నారని సమాచారం.
వైసీపీ నుండి కొందరు నేతలు టీడీపీ లో చేరిన తర్వాత, వారికి అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారిని సులభంగా కలిసే అవకాశాలు లభిస్తున్నాయి. వీరు నెలకు 3-4 సార్లు నాయకులను కలుస్తున్నారని సమాచారం. అయితే, పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన అసలు టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా మహిళా నేతలు, తమ నాయకులను కలవలేకపోవడం వల్ల ఆవేదన చెందుతున్నారు.
వలస నేతలు టి.డి. జనార్దన్ గారు, అశోక్ బాబు గారు, మరియు అచ్చెన్నాయుడు గారి పేర్లను తరచుగా వాడుతూ అనవసరంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు మరియు విజయవాడ ప్రాంతాల్లోని మహిళా నేతలు తమ అధినాయకులను కలవలేకపోవడం ఆశ్చర్యకరం. ఈ పరిణామాలు నిజమైన టీడీపీ కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఈ సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే రోజాల్లో పార్టీకి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.