PRIYANKA GANDHI : కేసీఆర్ సర్కార్ తప్పులు… బీజేపీ పట్టించుకోదు : ప్రియాంక
బీఆర్ఎస్- బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేననీ... కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామంటున్నారు ప్రియాంక గాంధీ.
PRIYANKA SPEECH : బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒక్కటేననీ… కేసీఆర్ తప్పుల్ని కమలం పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు AICC లీడర్ ప్రియాంక గాంధీ. అసిఫాబాద్ లో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. వరల్డ్ కప్ క్రికెట్ ను వదిలిపెట్టి తన కోసం వచ్చినదుకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. జల్ జంగిల్ జమీన్ కోసం గిరిజనం ఎదురు చూస్తున్నారు. ఆదివాసీ సమాజం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పెట్టిందన్నారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 యేళ్ళయినా ఆమె అందరి మదిలో ఉన్నారు. అందుకు కారణం ఆమె చేసిన మంచి పనులే… అవే మీకు దగ్గర చేశాయన్నారు ప్రియాంక. మీరు ఇచ్చిన అధికారాన్ని అంతే బాధ్యతగా కాంగ్రెస్ నిర్వహించింది. తెలంగాణను కేసీఆర్ ఆగం చేశారు… ఏ ఉద్దేశ్యంతో రాష్ట్రం ఇచ్చారో అది నెరవేర్చలేదు. కెసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదు. కేవం ఆయన కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు ప్రియాంక.
కెసిఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయనీ, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అన్నారు. BRS ప్రభుత్వంలో అన్నిధరలు ఆకాశాన్నంటాయి… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుతాయని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ. ధరణి పోర్టల్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూసమస్యలను అన్నింటినీ తమ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకుంటామన్నారు. తెలంగాణ రైతులు, రైతు కూలీలు, కార్మికులు అందరికీ అన్యాయం జరిగిందన్నారు ప్రియాంక.
కేసీఆర్, మోడీ ఒకటే. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదు… బీఆర్ఎస్ -బిజేపి రెండూ ఒక్కటే అన్నది ప్రజలు గమనించాలన్నారు ప్రియాంక. రైతులకోసం మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తెస్తే… కేసీఆర్ మద్దతు తెలిపారు. తెలంగాణలో బీజేపీ సపోర్ట్ చేస్తే… ఢిల్లీలో బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ప్రియాంక.