Rachamallu Siva Prasad Reddy: కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురు పెళ్లి విషయంలో రాజమల్లు వ్యవహరించిన తీరు ఇన్‌స్పిరేషన్‌గా మారింది. మరో కులానికి చెందిన వ్యక్తిని కూతురు ప్రేమించిన విషయం తెలిసినా.. వారి పెళ్లికి ఎలాంటి అడ్డు చెప్పలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 04:34 PMLast Updated on: Sep 07, 2023 | 4:34 PM

Proddatur Mla Rachamallu Siva Prasad Reddy Daughter Pallavi Marriage With Her Lover

Rachamallu Siva Prasad Reddy: ఎమ్మెల్యే కూతురు జోలికి కాదు కదా.. వాళ్ల ఫ్యామిలీ మెంబర్ జోలికి వెళ్లాలంటే భయపడతారు చాలామంది. పవర్‌తో, పలుకుబడితో శాల్తీలు గల్లంతు చేసే ఎమ్మెల్యేలనే చూశాం ఇన్నాళ్లు! ఐతే ఆ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం డిఫరెంట్‌. కోరుకున్న వ్యక్తితో కూతురు పెళ్లి జరిపించి.. నిజమైన నాన్న అనిపించుకున్నారు. నాయకుడు అనిపించుకున్నారు. ఆయనే ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తన కూతురు పెళ్లి విషయంలో రాజమల్లు వ్యవహరించిన తీరు ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

మరో కులానికి చెందిన వ్యక్తిని కూతురు ప్రేమించిన విషయం తెలిసినా.. వారి పెళ్లికి ఎలాంటి అడ్డు చెప్పలేదు. అంతే కాదు.. దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. రాచమల్లు కూతురు పల్లవి చదువుకునే రోజుల్లో పవన్ కుమార్‌తో ప్రేమలో పడింది. ఐతే కూతురు ఇష్టం మేరకు ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించేందుకు రాచమల్లు నిర్ణయం తీసుకున్నారు. పల్లవి కోరిక మేరకు.. పెళ్లిని నిరాడంబరంగా జరిపించారు. కులం, మతం, డబ్బు.. ఇలా ఏ విషయాన్ని పట్టించుకోలేదు. కూతురు కోరుకున్న వాడితో ఏడడుగులు నడిపించారు. సంప్రదాయబద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మధ్య వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రొద్దుటూరు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వచ్చారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థాయిని, డబ్బును, కులానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కూతురు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేశానని… ఆడపిల్లల అభిప్రాయాలకు ప్రతీ ఒక్కరు గౌరవం ఇవ్వాలని రాచమల్లు అంటున్నారు.

వారి నిర్ణయాలు బాగోలేకపోతే.. సూచనలు చేయడమే మన బాధ్యత తప్ప.. వారి నిర్ణయాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని మెసేజ్‌ ఇస్తున్నారు. చదువు, ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ వివాహాన్ని జరిపించానని.. తన కూతురు వివాహాన్ని అంగీకరిస్తారని.. ఆశీర్వదిస్తారని అనుకుంటున్నానని.. నియోజకవర్గ జనాలను కోరారు రాచమల్లు. ఏమైనా ఈ కాలంలో ఇలాంటి లీడర్లు కూడా ఉంటారా అంటూ.. పెళ్లి ఫొటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.