Producer: నాకు వాళ్లకంటే పవన్ ఎక్కువ కాదు..బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్..!
తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ భక్తుడు ఎవరు అంటే అంతా టక్కున చెప్పే పేరు బండ్ల గణేష్. అందరూ ఏంటి ఆయన కూడా గర్వంగా చెప్పుకుంటాడు నేను పవన్ కళ్యాణ్ భక్తున్ని అని. కానీ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు బండ్ల గణేష్.

bandla-ganeshbandla-ganesh
పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమే కానీ తన భార్యా పిల్లలకంటే మాత్రం ఎక్కవ కాదన్నాడు. తనకే కాదు ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి తన భార్యా పిల్లల కంటే ఎవరు ఎక్కువ కాదన్నాడు. అయితే వాళ్ల తరువాత స్థానంలో మాత్రం ఎప్పుడూ పవన్ కల్యాణే ఉంటాడని చెప్పాడు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నాడు.
ఇక రాజకీయంగా తాను ఉద్దేశపూర్వకంగానే పవన్ దూరంగా ఉంటున్నట్టు చెప్పాడు గణేష్. పని చేయాలని ఉన్నా.. పవన్‌కు ఇబ్బంది కలిగించకూడదనే దూరంగా ఉంటున్నానన్నారు. ఓ లక్ష్యం కోసం పవన్ పని చేస్తున్నారని.. ఆ లక్ష్యానికి తాను అడ్డు కాకూడదన్నారు. తన దూకుడుతనం ఏదో రకంగా పవన్‌కు ఇబ్బంది తెస్తుందన్న భయంతోనే దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకునే కోట్ల మంది ప్రజల్లో తాను కూడా ఒకడినన్నాడు గణేష్. ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో పవన్ ఉంటారని చెప్పాడు.