Top Story:అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ పీఎస్ఆర్ ఆంజనేయులు, వైసీపీ ప్రతినిధిలా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు
పీఎస్ఆర్ ఆంజనేయులు...సీనియర్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పేరు చెబితే నేరస్థులు వణికిపోయేవారు. ఆయన ఎక్కడ పని చేసినా....తన మార్కును చూపించారు.

పీఎస్ఆర్ ఆంజనేయులు…సీనియర్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పేరు చెబితే నేరస్థులు వణికిపోయేవారు. ఆయన ఎక్కడ పని చేసినా….తన మార్కును చూపించారు. ఐపీఎస్ గా సమర్థవంతంగా పని చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా…అక్రమ కేసులు పెట్టడం…జైలుకు పంపించడంతో కీలకపాత్ర పోషించారు. సింపుల్ గా చెప్పాలంటే…వైసీపీ ప్రభుత్వానికి అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు నటి జెత్వానీ కేసులో అడ్డంగా బుక్కయ్యారు.
వైసీపీ హయాంలో…సీనియర్ ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులు…రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా పని చేశారు. ఆయన ఆరాచకాలు ఒకటా రెండా…చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉంది. ఆయన వేలు పెట్టని అంశమే లేదు. ఆయన టార్గెట్ ప్రతిపక్షాలు….ఉద్యోగాలు…ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వేధించడమే పీఎస్ఆర్ పని. నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరించారు. సీఎం జగన్‌కు గిట్టని రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయడంలో పీఎస్‌ఆర్‌దే ప్రధాన పాత్రన్న ఫిర్యాదులున్నాయి.
ప్రతిపక్ష పార్టీ నేతల అణచివేత, వేధింపులు, ప్రతీకార, కక్ష సాధింపు చర్యలకు పీఎస్ఆర్… మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారని ఆరోపణలూ ఉన్నాయి. అత్యంత కీలక స్థానంలో పని చేసిన సీతారామాంజనేయులు…పెద్దఎత్తున అరాచకాలకు పాల్పడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ, జనసేన నేతలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి జైలుకు పంపించడంలోనే ప్రధానపాత్ర పోషించారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ నేతల సేవలో తరించారంటూ ఈసీకి ఫిర్యాదు వెళ్లాయి. దీంతో సీతారామాంజనేయులును…ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పటి నుంచి వెయిటింగ్‌లోనే ఉన్నారు. తర్వాత జెత్వానీ కేసులో గతేడాది సెప్టెంబరులో సస్పెండయ్యారు.
నిఘా విభాగాధిపతిగా పని చేసిన సీతారామాంజనేయులు…అప్పటి ప్రభుత్వం కోసం అడ్డదిడ్డంగా వ్యవహరించారు. ఏసీబీ డీజీ పోస్టులో ఉన్న ఆయన…నాటి టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వంటి నేతలను కేసులతో వేధింపులకు గురి చేశారు. తెరపై ఎక్కడా కనిపించకుండా ప్రతిపక్ష నాయకుల్లో ఎవరిని, ఎక్కడ దెబ్బతీయాలో వ్యూహరచన చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపారు. తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను భయపెట్టి అణచివేశారు. ఇంకా చెప్పాలంటే…జగన్ కు అన్నీ తానై వ్యవహరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు వైసీపీకి చేరవేయడానికి పీఎస్‌ఆర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదులున్నాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తర్వాత…పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ అయ్యారు. ఇంట్లో ఉంటే ఏం వస్తుందని అనుకున్నారేమో…వైసీపీ నేతల సేవలో తరించారు. మద్యం కుంభకోణం కేసు నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అజ్ఞాతంలోకి పంపించడంలోనూ పీఎస్‌ఆరే కీలకంగా వ్యవహరించారు. ఆయా కేసుల్లో నేతలకు పోలీసులు నోటీసులిస్తే ఎలా స్పందించాలి ? విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి ? వంటి అంశాల్లో నేతలకు డైరెక్షన్ ఇవ్వడంలోనూ పీఎస్ఆర్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే…పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ హయాంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా, పీసీఆర్ ఆంజనేయులు కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రూపు-1 ఉద్యోగాల నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. 150-200 కోట్లకు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్-1 పోస్టుల ఎంపికలోనూ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన వారికే పోస్టింగ్ లు వచ్చేలా పీఎస్ఆర్ కీ రోల్ పోషించారని అప్పట్లో ప్రచారం జరిగింది. నటి జెత్వాని కేసులో అరెస్టవడంతో…దీనిపైనా ప్రభుత్వం విచారణ జరిపించేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై అక్రమ కేసు బనాయించి, ఆయనతో పాటు కుటుంబాన్నీ తీవ్రంగా వేధించారు. సుప్రీంకోర్టులో బెయిల్ పొందేవరకూ ఆయన అజ్ఞాతంలో గడిపారు. దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.
\