Raghu Rama Krishna Raju: విగ్గు రాజు పేరుతో వికీపీడియా.. రఘురామకు అవమానం!
ఉండి స్థానంలో అభ్యర్థిని మార్చి.. రఘురామకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే టెన్షన్ కూడా టీడీపీని వెంటాడుతోంది.

Raghu Rama Krishna Raju: గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజు.. ఆ తర్వాత కొద్దిరోజులకే జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వైసీపీకి దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఈ మధ్యే ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి.. మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఐతే ఇప్పుడు రఘురామను అకామిడేట్ చేయడం.. చంద్రబాబుకు కొత్త తలపోటుగా మారింది.
Akhilesh Yadav Daughter: యూపీ ప్రచారంలో అదితి ఫిదా.. తల్లి డింపుల్ గెలుపు కోసం తంటాలు
ఉండి స్థానంలో అభ్యర్థిని మార్చి.. రఘురామకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే టెన్షన్ కూడా టీడీపీని వెంటాడుతోంది. దీంతో రామరాజును కూల్ చేసేందుకు చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. వికీపీడియాలో రఘురామకు తీవ్ర అవమానం జరిగింది. నరసాపుర లోక్‌సభ స్థానం వికీపీడియా ఓపెన్ చేస్తే.. 2019 ఎన్నికల్లో విజేత విగ్గురాజు అంటూ.. రఘురామ పేరు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రఘురామను విగ్గురాజు అంటూ.. వైసీపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేశారు చాలాసార్లు ! తన జుట్టుతో ఏం పని అంటూ.. రఘురామ చాలాసార్లు కౌంటర్ ఇచ్చారు కూడా.
ఇక వైసీపీ సోషల్ మీడియా సంగతి అయితే సరే సరి. రఘురామను టార్గెట్ చేయాలనుకున్న ప్రతీసారి విగ్గురాజా అంటూ.. పోస్టులు రాసుకొస్తుంది. ఐతే వికీపీడీయాలోనూ రఘురామ పేరు మార్చింది వైసీపీ సోషల్ మీడియానే అయి ఉంటుందనే టాక్ నడుస్తోంది. వికీపీడియా పేజ్‌ను ఎవరైనా ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని.. రఘురామ పేరును వైసీపీ శ్రేణుల్లో ఎవరో ఒకరు ఇలా మార్చి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఈ ఫొటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.