Raghu Rama Krishna Raju: టీడీపీకి తలనొప్పిగా మారిన రఘురామ.. టిక్కెట్ ఇస్తారా.. లేదా..?
రఘురామకు ఇప్పుడు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిన పరిస్థితి. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన అనుకున్నా.. పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి శ్రీనివాస వర్మను అభ్యర్థిగా అనౌన్స్ చేసింది కమలం పార్టీ.

Raghu Rama Krishna Raju: ఏపీ రాజకీయం అంతా ఒకవైపు.. రఘురామ కామెంట్స్ మరోవైపు అన్నట్లుగా ఉంది సీన్. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది అన్నట్లుగా తయారైంది ట్రిపులార్ పరిస్థితి. ఎంపీ టికెట్ లేదు. అసెంబ్లీ టికెట్ వస్తుందో రాదో అర్థం కాదు. ఐతే ఆయన మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గించుకోవడం లేదు. తనను అకామిడేట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే అన్నట్లుగా.. టీడీపీని కార్నర్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సైకిల్ పార్టీని ఒత్తిడికి గురి చేస్తోంది.
CHANDRABABU NAIDU: కుప్పంలో వాలంటీర్ల రాజీనామా.. చంద్రబాబుకు ఓటమి తప్పదా..?
టీడీపీకి తలపోటుగా మారింది. రఘురామకు ఇప్పుడు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిన పరిస్థితి. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన అనుకున్నా.. పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి శ్రీనివాస వర్మను అభ్యర్థిగా అనౌన్స్ చేసింది కమలం పార్టీ. ఐతే ఉండి అసెంబ్లీ టికెట్ రఘురామకు ఇవ్వాలని టీడీపీ ఆలోచన చేయగా.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని ఈయనకు ఇస్తే పరిస్థితి ఏంటా అనే ఆలోచనే.. పసుపు పార్టీని టెన్షన్ పెడుతోంది. ఉండి టికెట్ కోసం టీడీపీలో భారీ పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో పాటు.. శివరామరాజు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరినీ కాదని రఘురామకు టికెట్ ఇస్తే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. రామరాజు, శివరామరాజు రెబెల్స్‌గా మారితే.. ఉండిలో పార్టీ ఓటమి ఖాయం అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో రఘురామ వ్యవహారం.. ఇప్పుడు వాళ్లకు కొత్త తలపోటుగా మారింది.
ఐతే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చి.. నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కమలం పార్టీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. నరసాపురం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరిస్తే.. అక్కడి నుంచి రఘురామను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. బీజేపీ పెద్దల నిర్ణయం కోసం.. చంద్రబాబు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్‌గా.. రఘురామ టికెట్ వ్యవహారం.. ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది.