Raghu Rama Krishnam Raju: నరసాపురం టికెట్‌పై రఘురామ ధీమా.. చంద్రబాబుతో మైండ్‌గేమ్ ఆడుతున్నాడా..?
టీడీపీ నుంచి అయినా చంద్రబాబు దయచూపిస్తారు అనుకుంటే.. ఆ చాన్స్ కూడా లేకుండా పోయింది. ఏలూరులో యనమల అల్లుడిని మార్చి రఘురామను బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే మిగిలిపోయింది.
Raghu Rama Krishnam Raju: నరసాపురం నుంచి పోటీ చేస్తా.. పెద్ద సభ పెడతా అంటూ.. టీడీపీ, జనసేన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్‌లో రఘురామ మాట్లాడిన మాటలు ఇప్పటికీ రీసౌండ్ ఇస్తున్నాయ్. కట్ చేస్తే మూడు లిస్ట్‌లు వచ్చాయ్ కానీ.. రఘురామకు చాన్స్ మాత్రం రాలేదు. నరసాపురం ఎంపీ సీటు బీజేపీకి కేటాయించగా.. కమలం పార్టీ భూపతిరాజు శ్రీనివాస్‌వర్మకు టికెట్ కేటాయించింది. పోనీ టీడీపీ నుంచి అయినా చంద్రబాబు దయచూపిస్తారు అనుకుంటే.. ఆ చాన్స్ కూడా లేకుండా పోయింది.
CHANDRABABU NAIDU: బాబూ.. ఇదేందయ్యా.. లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావేంటి..?
ఏలూరులో యనమల అల్లుడిని మార్చి రఘురామను బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇలాంటి పరిణామాల మధ్య.. నరసాపురం తనదేనని.. అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు, చూపిస్తున్న కాన్ఫిడెన్స్.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలనన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని.. కూటమి తనకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తుందన్న రఘురామ మాటలపై కొత్త చర్చ జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్ మీద పూర్తి విశ్వాసం ఉందని, చంద్రబాబు తనకు అన్యాయం చేయరని అంటున్నారు ట్రిపులార్. ఇలా మాటకు ముందు ఒకసారి చంద్రబాబు, మాట తర్వాత ఒకసారి చంద్రబాబు పేరు చెప్తూ.. ఆయనకు బాధ్యత గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఇక అదే సమయంలో టికెట్ విషయంలో నమ్ముకున్నోడికి న్యాయం చేయలేని వాడు.. కేంద్రంతో పోరాడి పోలవరం ప్రాజెక్ట్‌లు నిధులు ఎలా తెస్తారనే ప్రచారం జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని.. అందుకోసమైనా కూటమి తనకు న్యాయం చేస్తుందంటూ.. చంద్రబాబు టార్గెట్‌గా రఘురామ మైండ్‌గేమ్ మొదలుపెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. చంద్రబాబు నోటి నుంచి నో అనే మాట రాకుండా చేయాలన్న స్ట్రాటజీతో రఘురామ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రఘురామకి నరసాపురం టిక్కెట్ దక్కితే సరే.. ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదనే మాట చంద్రబాబు నుంచి వస్తే.. అప్పుడు అసలు రచ్చ స్టార్ట్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్.