Raghunandan Rao: మెదక్ ఎంపీగా బరిలోకి రఘనందన్..? బీజేపీ సీటు ఖాయమేనా..?
పటాన్ చెరులో జరిగిన ప్రధాని మోడీ సభ ఏర్పాట్లలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ సభ సక్సెస్ కావడంతో కమలనాథుల్లో జోష్ పెరిగింది. సభ సక్సెస్ చేయడానికి ఛాలెంజ్‌గా తీసుకొని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేశారు.
Raghunandan Rao: మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మంగళవారం పటాన్ చెరులో ప్రధాని నరేంద్ర మోడీ సభ గ్రాండ్ సక్సెస్‌తో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మెదక్ పార్లమెంట్ పరిధిలో విజయసంకల్ప యాత్రలను కూడా రఘునందన్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. పటాన్ చెరులో జరిగిన ప్రధాని మోడీ సభ ఏర్పాట్లలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ సభ సక్సెస్ కావడంతో కమలనాథుల్లో జోష్ పెరిగింది. సభ సక్సెస్ చేయడానికి ఛాలెంజ్‌గా తీసుకొని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేశారు.
YS SHARMILA: ఇదేనా విజన్.. కొట్టడం, మింగడం.. ఇంతకుమించి ఏం చేశావ్.. అన్నను ఆడుకున్న షర్మిల..
ఈ సందర్భంగా స్టేజీ మీద మోడీతో రఘునందన్ తన మెదక్ లోక్‌సభ టిక్కెట్ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆల్ ద బెస్ట్.. గో ఏ హెడ్ అని మోడీ భరోసా ఇచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి గతంలో టిక్కెట్‌పై హామీ వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే గత 20 రోజులుగా ఆయన ప్రచార రథాలు మెదక్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నాయి. దుబ్బాక, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, పటాన్ చెరు, నర్సాపూర్, గజ్వేల్ పట్టణాలతో పాటు చాలా చోట్ల రఘునందన్ రావు పేరుతో భారీగా ఫెక్సీలు వెలిశాయి. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం రోజునే బాలరాముడు, మోడీ, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. మెదక్ ఎంపీ టిక్కెట్ కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న అంజిరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి భర్తనే అంజిరెడ్డి. ఆయన కూడా అధిష్టానం దగ్గర పైరవీ చేస్తున్నారు.
రఘునందన్‌కు మెదక్ పార్లమెంట్ ఏరియాలో పట్టు ఉండటంతో టిక్కెట్ ఇస్తే గెలుస్తాడన్న నమ్మకం కూడా బీజేపీ అధిష్టానానికి వచ్చినట్టు చెబుతున్నారు. సంగారెడ్డి కోర్టులో లాయర్‌గా ఉన్న రఘునందన్ రావుకి సిద్ధిపేట, నర్సాపూర్, మెదక్, గజ్వేల్ నియోజకవర్గాల్లోనూ సంబంధాలు ఉన్నాయి. మోడీ సభ సక్సెస్ తర్వాత రఘునందన్ రావు వైపు బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే బీజేపీ సెకండ్ లిస్ట్ లో ఆయన పేరు అనౌన్స్ చేస్తాన్నరన్న టాక్ నడుస్తోంది.