నేను వకీల్ సాబ్, బీఆర్ఎస్ ను వదలను: రఘునందన్ రావు

తెలంగాణా మంత్రి కొండా సురేఖ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలపై బిజెపి ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 04:40 PMLast Updated on: Oct 01, 2024 | 4:40 PM

Raghunandan Rao Warning To Brs Social Media

తెలంగాణా మంత్రి కొండా సురేఖ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలపై బిజెపి ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారు అని మండిపడ్డారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశానన్నారు. అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశానని… అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను తెలిపారు.

అక్కకు మద్దతుగా ఒక లాయర్ గా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. పోస్ట్ ఎకౌంటు లో డీపీ హరీష్ రావు, కేటిఆర్ ఫోటో ఉందని బీఆరఎస్ సోషల్ మీడియాకు నియంత్రణ లేదా అని నిలదీశారు. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండని సవాల్ చేసారు. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండని డిమాండ్ చేసారు. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశాను అన్నారు.

బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కప్పారని ఇంత సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడతారు అనుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియా ను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు అనుకుంటే పోలీసు కంప్లయింట్ ఇవ్వండని సూచించారు. వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదని హితవు పలికారు.