ఆ నా కొడుకుని వదలను.. రఘురామ
తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును... ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటాడుతున్నారు. ఎలాగైనా సరే తులసిబాబును అరెస్ట్ చేయించాలని రఘురామ పట్టుదలగా వ్యవహరిస్తున్నారు.
తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును… ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటాడుతున్నారు. ఎలాగైనా సరే తులసిబాబును అరెస్ట్ చేయించాలని రఘురామ పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. అయినా సరే తులసి బాబు పోలీసు విచారణకు డుమ్మా కొట్టాడు. శుక్రవారం విచారణకు పిలవగా తాను విచారణకు రాలేనని… తనకు కొంత సమయం కావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు లేఖ ద్వారా తెలియజేసాడు.
హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడనే ఆరోపణలను తులసిబాబుపై ఉన్నాయి. ఇలా తప్పించుకుంటున్న తులసి బాబు విషయంలో రఘురామ సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా తులసిబాబు సమయం కోరితే పరిగణనలోకి తీసుకోవద్దని జిల్లా ఎస్పీకి రఘురామకృష్ణరాజు లేఖలో విజ్ఞప్తి చేసారు. 2021 మే 14 రాత్రి సీఐడీ అధికారులు తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సమయంలో… 115 కిలోల బరువున్న పొడవైన వ్యక్తి తన ఛాతీపై కూర్చున్నాడని తనకు కొంతమంది చెప్పినట్టు రఘురామ తెలిపారు. ఆ వ్యక్తిని తులసిబాబుగా తాను భావిస్తున్నానని లేఖలో రఘురామ వివరించారు.