YS JAGAN: ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

YS JAGAN: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు హైకోర్టు షాకిచ్చింది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సీఎం జగన్‌తోపాటు పలువురు మంత్రులు, అధికారులు సహా మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
BRS, Theinmar Mallanna : బీఆర్‌ఎస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న.. వైరల్ ఫొటోల వెనక అసలు నిజం..
ఈ ఆర్థిక అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ కోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. రఘురామ వ్యక్తిగత ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని, దీనిలో ఎలాంటి ప్రజా ప్రయోజనవ్యాజ్యం లేదన్నారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోర్టుకు తెలిపారు. రఘరామపైనే గతంలో ఆర్థిక అవకతకలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా ‘ప్రభుత్వ అవినీతి’ అంటూ మీడియాలో రఘురామ మాట్లాడారని వెల్లడించారు. కాగా.. కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డుల్ని ధ్వంసం చేసిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని మురళీధర్ రావు వాదనలు వినిపించారు. దీంతో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ వచ్చే నెల 14కు వాయిదా వేసింది. పిటిషన్‌తో సంబంధం ఉన్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.