జగన్ కంటే రఘురామే బలవంతుడా…? మాస్టర్ మైండ్ రఘురామ

ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్తానం లేకపోయినా, కీలక పదవులు నిర్వహించకపోయినా... ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాత్రం ఓ రేంజ్ లో ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు అంటూ సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2024 | 06:20 PMLast Updated on: Nov 27, 2024 | 6:20 PM

Raghurama Master Mind Step On Custodial Torture Case

ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్తానం లేకపోయినా, కీలక పదవులు నిర్వహించకపోయినా… ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు మాత్రం ఓ రేంజ్ లో ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు అంటూ సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకప్పుడు జేసి ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వంటి వాళ్లకు ఇలాంటి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు వాళ్లకు మించి రఘురామ ఫాలోయింగ్ పెంచుకుని నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయ్యారు.

ఎంపీగా ఉన్నప్పుడు జగన్ కు ఎదురు తిరిగి దెబ్బలు కూడా తిన్నారు పాపం. ఇది చాలా మంది చేత కన్నీరు పెట్టించింది. కోర్ట్ కు వెళ్ళే ముందు ఆయన మీడియాకు కాళ్ళు చూపించిన సన్నివేశం ఇప్పటికీ చాలా మంది కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. కస్టడీలో పెట్టి ఆయన్ను కొట్టడం సంచలనానికి మించి అయింది. వాస్తవానికి చాలా మంది రాజకీయ నాయకులకు వైసీపీ ప్రభుత్వంలో అలాంటి ట్రీట్మెంట్ జరిగింది అనే వార్తలు వచ్చాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కూడా అలాగే హింసించారు అని తెలిసింది.

జేసి ఫ్యామిలీ కూడా ఈ సమస్యలు ఎదుర్కొంది. కాని వాళ్ళందరి కంటే రఘురామ మాత్రం పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నారు. తనను హింసించిన వాళ్ళను వైసీపీ అధిష్టానం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి కాపాడాలి అనుకున్నా సరే రఘురామ పంతం నేగ్గించుకుని విజయ్ పాల్ ను అరెస్ట్ చేయించారు. 2021 లో జరిగిన అమానుష ఘటన జరిగిన అనంతరం నుంచి పరిణామాలు చూస్తే రఘురామ ఎంత బలవంతుడు అనేది అర్ధమవుతుంది. గుంటూరు ఆస్పత్రి నివేదిక ప్రకారం ఆయనపై దాడి జరగలేదని ఒక నివేదిక ఇచ్చారు.

న్యాయస్థానం జోక్యంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నివేదిక మాత్రం గాయాలు గుర్తించి అసలు విషయం బయటపెట్టారు. ఆ పై గాయాలు సోరియాసిస్ అని కామెంట్స్ వచ్చాయి. ఎడిమా వ్యాధి అంటూ ప్రచారం చేసారు. ఆ గాయాలు తనంతట తానే చేసుకున్నారని సీఐడీ చెప్పింది. సీఐడీ అధికారుల పర్యవేక్షణలోనే తాను ఉన్నానని… తాను ఆ గాయాలు చేసుకోలేదు అని, ఉంటె సాక్ష్యాలు చూపించాలి అని రఘురామ ఎదురు ప్రశ్న వేసారు. దీనితో ప్రభుత్వం, సీఐడీ ఇరుకునపడ్డాయి. ఈ కేసులో తమకు ఏం కాదని ధీమాగా ఉన్న అధికారులకు మూడేళ్ళ తర్వాత గుంటూరు నగరం పాలెం పోలీసు స్టేషన్ లో కేసు పెట్టి రఘురామ షాక్ ఇచ్చారు. జులై 12 ఆయన కేసు నమోదు చేయించారు. నాటి సిఎం జగన్ సహా పోలీసు వైద్య అధికారులపై రివర్స్ కేసు పెట్టారు.

ఆనాటి రెండు కేసుల్లో సికింద్రాబాద్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించమని ఆదేశాలు ఇచ్చినట్లు బెయిల్ ఉత్తర్వులు ఇస్తూ విచారణకు సహకరించమని ఉత్తర్వులు ఇచ్చారు. సిబిఐ విచారణకు మాత్రమే సుప్రీం తిరస్కరించినట్లు వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. సిఐడీ విచారణకు కాదని చెప్పే ప్రయత్నం చేసారు. కాని రఘురామ కొడుకు మాత్రం హైకోర్ట్ లో తేల్చుకుంటాం అని పట్టుబట్టారు. ఆ కేసును ఇప్పుడు ముందుకు కదిపారు రఘురామ. 2023 లో ముందుచూపు తో మిలటరీ ఆసుపత్రి నివేదిక తో పాటు ఆర్ఆర్ఆర్ ఆనాటి కాల్ డేటా భద్రపరిచే విధంగా న్యాయస్థానం ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారు.

ఇప్పుడు అదే కోర్ట్ లో కీలకం అయింది. విచారణ అధికారిగా వ్యవహరించిన విజయ్ పాల్ ను కాపాడటానికి జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేసారు. ఇప్పుడు సూత్రధారుల మీద ఫోకస్ పెట్టారు.