జగన్ నీ కోసం వెయిటింగ్, రఘురామ సంచలన కామెంట్స్
తనపై కాస్టోడియాల్ టార్చర్ చేసిన ఐపిఎస్ అధికారి విజయ్ పాల్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేయడంతో రఘురామ కృష్ణం రాజు స్పందించారు.

తనపై కాస్టోడియాల్ టార్చర్ చేసిన ఐపిఎస్ అధికారి విజయ్ పాల్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేయడంతో రఘురామ కృష్ణం రాజు స్పందించారు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని… నన్ను దారుణంగా చిత్రవద చేశారు..చంపాలని చూసారని పేర్కొన్నారు. మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు రఘురామ.
న్యాయం గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. త్వరలో నా కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవారంత బయటకు వస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు నేను ఏపార్టీ పై విమర్శలు చేయనన్నారు. నా కేసు గురించి మాట్లాడే హక్కు నాకుందన్న ఆయన శాసన సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని స్పష్టం చేసారు. గుజరాత్ ,సిక్కిం,ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలు లేవని… మహారాష్ట్ర లో కూడా ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. జగన్ మోహన్ రెడ్డి సభకు వస్తే ఆయనకు సమయం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసారు. ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు జగన్ సభకు వచ్చి మాట్లాడొచ్చని హితవు పలికారు.