RAHUL GANDHI: తెలంగాణ నుంచి రాహుల్ పోటీ.. వయనాడ్ సీటుకు సీపీఐ ఎసరు
గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో బీజేపీ లీడర్ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. వయనాడ్ లో గెలిచారు. అయితే ఈసారి ఆ సీటుకు సీపీఐ ఎసరు పెడుతోంది.
RAHUL GANDHI: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి ఏదో ఒక స్థానం ఎంచుకోవాలని ప్రపోజల్ పెట్టారు. గతంలో సోనియాగాంధీని కూడా ఖమ్మం నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేశారు. సీఎం రేవంత్ తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి, మరో మంత్రి పొంగులేటి వెళ్లి కోరినప్పటికీ.. సోనియా మాత్రం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీని కోరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు.
PAWAN KALYAN: ఒకే స్క్రీన్ మీద.. పవన్, ప్రభాస్, నాని..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాహుల్ పోటీపై చర్చించినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో బీజేపీ లీడర్ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. వయనాడ్ లో గెలిచారు. అయితే ఈసారి ఆ సీటుకు సీపీఐ ఎసరు పెడుతోంది. అక్కడ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా భార్య.. అనీ రాజా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. LDF అభ్యర్థిగా ఆమె పేరును కూడా ప్రకటించారు. సీపీఎం ఆధ్వర్యంలోని UDF లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. తమకు ప్రత్యర్థి కూటమి నుంచి అనీ రాజా నిలబడుతున్నా.. జాతీయ స్థాయి నేత భార్య కావడంతో అక్కడ పోటీకి రాహుల్ ఇంట్రెస్ట్ గా లేనట్టు తెలుస్తోంది. అందుకే వయనాడ్ లో కాకుండా దక్షిణాదిలోనే కర్ణాటక లేదా తెలంగాణ నుంచి పోటీకి దిగాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇండియా కూటమికి బూస్టింగ్ గా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. లాగే రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలుచుకోడానికి అవకాశం ఉంటుందని అంటున్నాయి.
భువనగిరి, మెదక్, ఖమ్మం, నల్లగొండ లోక్ సభ నియోజకవర్గాలపై ఇప్పటికే కాంగ్రెస్ ఢిల్లీ నేతలు కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు తెలంగాణ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ రాహుల్ ఒప్పుకుంటే మాత్రం.. గాంధీ కుటుంబం నుంచి పోటీ చేసిన రెండో వ్యక్తి అవుతారు. గతంలో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ పోటీ చేశారు.