జగన్ పై రాహుల్ గాంధీ మాస్టర్ ప్లాన్.. షర్మిల రూట్ మ్యాప్ రెడీ…!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బలపడటం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ సమయంలో వైఎస్ జగన్ ఎలా రాజకీయం చేస్తారనేది కూడా కీలకంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బలపడటం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ సమయంలో వైఎస్ జగన్ ఎలా రాజకీయం చేస్తారనేది కూడా కీలకంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కావాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలోకి తీసుకున్న… సరే చంద్రబాబు నాయుడు అప్పట్లో… ఎక్కడా వెనకడుగు వేయలేదని, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని… కాబట్టి జగన్ కూడా హాజరు కావాలని.. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు.
అలాగే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాని సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. అందుకే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా సరే… జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అనే డిమాండ్ ఎక్కువగా ఆ పార్టీలోనే వినపడుతోంది. అయితే భయం కారణంగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. ఇక ఇప్పుడు ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి… వైఎస్ షర్మిల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో వైసిపి క్రమంగా బలహీనపడే అవకాశం ఉండటం, కొంతమంది కీలక నాయకులు కూడా పార్టీ నుంచి బయటికి వచ్చే సంకేతాలు కనబడటంతో… కాంగ్రెస్ పార్టీ కాస్త జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే వ్యూహ రచన చేసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా.. ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగి బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తమకు పట్టులేని రాష్ట్రాల్లో కూడా హిందుత్వం తో బలపడాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా రాజకీయం చేసి తిరిగి తమ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకే ఏపీలో వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు కొంతమంది ఇప్పుడు బయటకు వెళుతున్నారు.
వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలో బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీనితో రాష్ట్రంలో బలహీనంగా ఉన్న నాయకత్వాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి.. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నది. తమిళనాడులో కూడా ఇండియా కూటమి అధికారంలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి… షర్మిల రాష్ట్ర పర్యటనల్లో రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2025లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంచలనాలకు తెరతీసే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.