చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్... చెన్నైలో కూడా వర్క్ చేస్తుందా...? అంటే మాజీ మంత్రి కొడాలి నానీకి ఎర్త్ పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా...? అవుననే సమాధానం వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన వాళ్ళల్లో కొడాలి నానీ ఒకరు.
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్… చెన్నైలో కూడా వర్క్ చేస్తుందా…? అంటే మాజీ మంత్రి కొడాలి నానీకి ఎర్త్ పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా…? అవుననే సమాధానం వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన వాళ్ళల్లో కొడాలి నానీ ఒకరు. వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేసినా చేయకపోయినా సరే నానీ పదే పదే మీడియా ముందుకు వచ్చి ఘాటు విమర్శలు చేసే వాళ్ళు. ఆయన వ్యాఖ్యల్లో విమర్శల కంటే బూతులే ఎక్కువగా ఉండేవి. ఈ విమర్శలపై వైసీపీ నేతలు కూడా షాక్ అయ్యేవారు.
జగన్ ను విమర్శించే వాళ్ళనే కాదు… టీడీపీని పొగిడిన వాళ్ళపై కూడా కొడాలి నానీ విమర్శలు చేసేవాళ్ళు. వెనుకా ముందు చూడకుండా ఆయన ఒంటి కాలుపై లేచిన సందర్భాలు ఎన్నో. ఆయన విమర్శలకు మీడియా కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. టీడీపీని తిట్టాల్సిన ప్రతీసారి… వైసీపీ అనుకూల మీడియా ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకునేది. ఎవరిని అయినా ఏ సందర్భంలో అయినా కారణం లేకుండా విమర్శించడంలో కొడాలి నానీ దిట్ట. జగన్ కూడా నానీకి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవారు.
అసెంబ్లీలో సైతం నానీ బూతులు మాట్లాడటంలో వెనకడుగు వేసేవారు కాదు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాను ప్రధానంగా టార్గెట్ చేసి నానీ బూతులు తిట్టేవారు. ఆ బూతులు విని జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్న సందర్భాలు ఎన్నో. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. అప్పుడు కొట్టుకుందాం, సెక్యూరిటీ లేకుండా రా అంటూ సవాల్ చేసిన నానీ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. అప్పుడప్పుడు జగన్ కంటి తుడుపు కోసం మాట్లాడుతున్నా నానీ పెద్దగా మీడియాలో కనపడటం లేదు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు.
నానీని అరెస్ట్ చేసి… అంకుశం సినిమాలో రామిరెడ్డిని నిక్కర్ పై పోలీసులు లాక్కుని వెళ్లినట్టు లాక్కుని వెళ్ళే బాధ్యత నాదీ అని అప్పట్లో మంత్రి లోకేష్ ప్రకటించారు. రెడ్ బుక్ లో నానీ పేరు ఉన్నా ఎందుకు ఆలస్యం జరుగుతోంది అంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇటీవల లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా కొన్ని కామెంట్స్ చేసారు. రెండు చాప్టర్లు పూర్తి అయ్యాయి అని… థర్డ్ చాప్టర్ త్వరలోనే స్టార్ట్ చేస్తామని అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే రాముని ఉద్దేశించి మాట్లాడారు.
దీనితో నానీని అరెస్ట్ చేయవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య చెన్నైలో అన్నా నగర్ పోలీస్ స్టేషన్ లో కొడాలి నానీపై ఫిర్యాదు చేయడానికి సిద్దమయ్యారు. గత ఏడాది నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజనీ కాంత్ పాల్గొనగా రజనీ కాంత్ పై నానీ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆరోగ్యం, ఆహార్యంపై, సినిమా షూటింగ్ లపై నానీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలపై ముందుగా ఏపీలో ఫిర్యాదు చేయాలని చూసినా… కొన్ని కారణాలతో ఆమె చెన్నైలోనే ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే పలువురు న్యాయవాదులతో కూడా ఆమె చర్చలు జరిపినట్టు సమాచారం.