పవన్ కు రజనీ కుమార్తె ఫోన్, త్వరలోనే అమరావతికి…
ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హవా గట్టిగానే నడుస్తోంది. ఎవరి ఊహకి అందని రేంజ్ లో 21 స్థానాలకు 21 గెలవడం ఉప ముఖ్యమంత్రిగా, అలాగే కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించడం అన్నీ కూడా ఒక సంచలనమే. ఇక తన మార్క్ పక్కాగా ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడుతున్నాడు.
ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హవా గట్టిగానే నడుస్తోంది. ఎవరి ఊహకి అందని రేంజ్ లో 21 స్థానాలకు 21 గెలవడం ఉప ముఖ్యమంత్రిగా, అలాగే కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించడం అన్నీ కూడా ఒక సంచలనమే. ఇక తన మార్క్ పక్కాగా ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడుతున్నాడు. మంత్రి పదవి అంటే అలంకారం కాదని బాధ్యత అని, గౌరవాన్ని పెంచేలా ఉండాలని పవన్ ప్రూవ్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ప్రభుత్వం తనకు కల్పించిన క్యాంపు ఆఫీసుని కూడా ఆయన ప్రభుత్వానికి అప్పగిస్తూ లేఖ రాసారు.
ఇప్పుడు మరోవైపు ఏపీలో సినిమా రంగంపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నారు. ఏపీలో సినిమా రంగాన్ని బలోపేతం చేయాలనే ప్లాన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారట. ఏపీలో మల్టీ లాంగ్వేజ్ కి సంబంధించి ఒక స్టూడియోని ప్రభుత్వమే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే టాక్ వస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ కర్త, కర్మ, క్రియ అని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. హైదరాబాద్, విజయవాడ హైవేలో ఏర్పాటు చేయనున్నారని వార్తలు వచ్చాయి. అలాగే స్టూడియో నిర్మాణాలను చేపట్టే వారికి కూడా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది.
ఈ నేపధ్యంలో ఇతర భాషల వాళ్ళు కూడా ఇప్పుడు ఏపీలో ఫోకస్ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత, సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ కూడా ఏపీలో స్టూడియో నిర్మించాలని భావిస్తున్నారట. మినీ స్టూడియో నిర్మాణం కోసం సౌందర్య త్వరలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ని కలవనున్నారు. మినీ స్టూడియోని వైజాగ్ లో నిర్మించే ఆలోచనలో సౌందర్య ఉన్నారట. దీనికి సంబంధించి ఒప్పందం చేసుకునేందుకు ఆమె అమరావతి వెళ్తున్నారు. త్వరలోనే పవన్ తో భేటీ అయి తాను ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా అనే దానిపై ఒక స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే పవన్ కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ కూడా కోరారట సౌందర్య. మరో తమిళ నిర్మాతతో కలిసి ఆమె అమరావతి రానున్నారు.