RAJINI SAICHAND: రేవంత్ నాకు బాబాయి అవుతాడు.. బాంబు పేల్చిన సాయిచంద్ భార్య రజినీ..
పదవిలో ఉండగానే సాయిచంద్ చనిపోయారు. దీంతో ఆ పదవిని సాయిచంద్ భార్య రజినికి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ సాయిచంద్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండానే తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది.
RAJINI SAICHAND: సింగర్ సాయిచంద్.. తెలంగాణలో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సాయిచంద్.. తన పాటల ద్వారా ఉద్యమంలో ఉత్తేజం నింపారు. ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ సాయిచంద్ పాట ఉండాల్సిందే. చిన్న వయసులోనే పెద్దల మన్ననలు పొందిన సాయిచంద్‌కు తెలంగాణ వచ్చిన తర్వాత తగిన పదవి కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
Bigg Boss Season 7 Winner : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మిస్సింగ్.. ఫోన్ స్విచ్ఛాఫ్..
వేర్‌హౌజ్ కార్పోరేషన్ చైర్మన్‌గా పదవినిచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ పదవిలో ఉండగానే సాయిచంద్ చనిపోయారు. దీంతో ఆ పదవిని సాయిచంద్ భార్య రజినికి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ సాయిచంద్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండానే తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది. దీంతో కార్పోరేషన్ చైర్మన్లుగా ఉన్న అందరూ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే క్రమంలో రజిని రాజీనామా కాస్త ఆలస్యం అయ్యింది. దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారబోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇదే విషయం గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు రజినీ. ప్రస్తత సీఎం రేవంత్ రెడ్డి రజినీకి స్వయానా బాబాయి అవుతారట. వాళ్ల తల్లిగారి చుట్టాల తరఫున రేవంత్ తనకు బాబాయి వరుస అవుతారంటూ చెప్పారు రజినీ.
రేవంత్ జడ్పీటీసీగా ఉన్నప్పుడు చాలా సార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కలిశానని చెప్పారు. కానీ సాయిచంద్‌ను పెళ్లి చేసుకున్న తరువాత ఎప్పుడూ రేవంత్‌ను కలవలేదంటూ చెప్పారు. ప్రస్తుతం తాను పార్టీ మారబోవడంలేదని.. రేవంత్ బాబాయి వరసే అయినప్పటికీ.. రాజకీయంగా ఆ బంధాన్ని ఉపయోగించుకోనంటూ క్లారిటీ ఇచ్చారు. సాయిచంద్ బాధ్యతను తనకు ఎలా అప్పగించారో.. అలాగే తన బాధ్యతను రాజకీయాల్లో కొనసాగిస్తానంటూ చెప్పారు. కానీ పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం.. రజినీ పార్టీ మారబోతున్నారు అనే టాక్ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఆవిడ చెప్పినట్టు బీఆర్‌ఎస్‌కు కట్టుబడి ఉంటారా.. లేక బాబాయి నుంచి పిలుపు రాగానే పార్టీ మారిపోతారా చూడాలి మరి.