నా డెన్ లో ఉన్నా దమ్ముంటే రండ్రా: వర్మ కామెంట్స్
నేను హైదరాబాద్ లోనే ఉన్నాను మొర్రో అంటే పరారీలో ఉన్నాను అంటారు అంటూ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యాడు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు అంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం.
నేను హైదరాబాద్ లోనే ఉన్నాను మొర్రో అంటే పరారీలో ఉన్నాను అంటారు అంటూ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యాడు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు అంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం. ప్రభుత్వం మారినా పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రచారం చేశారని… ప్రకాశ్ రాజ్ , నాగార్జున నన్ను దాచిపెట్టారని మీడియా ప్రచారం చేసిందని… పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్ గా మారింది అంటూ వర్మ కామెంట్ చేసాడు.
కార్టూన్ అనేది వ్యంగ్యంగా చెప్పే ఒక అంశమన్న వర్మ… నా గురించి ఎన్నో రకాలుగా బూతులు తిడుతూ మీమ్స్ పెడతారని… అమెరికా లాంటి దేశం కూడా మీమ్స్ ను నియంత్రించలేకపోయింది అంటూ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసాడు. అలాగే నేను నా ఎక్స్ అకౌంట్ లో వేల పోస్టులు పెట్టానని… వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత స్పందించారన్నాడు. సంవత్సరం తర్వాత నాలుగైదుగురు ఒకే సారి మేల్కొనడం ఏంటీ? అని ప్రశ్నించాడు.
వివిధ జిల్లాల్లో నాపై కేసులు పెట్టారన్న వర్మ నా పని వల్ల నేను హాజరుకాలేనని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నానని… నన్ను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు నా డెన్ కు వచ్చారన్నాడు. నేను డెన్ లో లేకపోవడంతో పరారీలో ఉన్నాడని, మంచం కింద దాక్కున్నాడని మీడియా కథలు అల్లిందని సెటైర్ లు వేసాడు. నా అరెస్టు గురించి ఏ పోలీసు అధికారి చెప్పలేదని న్యూస్ లేకపోతే న్యూస్ ను సృష్టిస్తున్నారు, నా విషయంలో అదే జరిగిందన్నాడు.