Ram Gopal Varma: వ్యూహం మిగిల్చిన ప్రశ్నలు.. సినిమాలో వీటికి సమాధానాలున్నాయా..?
వైఎస్‌ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంతోనే టీజర్ ఓపెన్ చేశాడు. వైఎస్‌ఆర్ మరణం తరువాత జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను షార్ట్ ఫాంలో చూపించాడు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వ్యూహాలు వేయడం.. జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం చూపించాడు.
Ram Gopal Varma: వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న వ్యూహం సినిమా ట్రైలర్‌ను ఇవాళ లాంచ్ చేశాడు ఆర్జీవి. యూట్యూబ్‌లో ఈ వీడియోను రిలీజ్ చేశాడు. వైఎస్‌ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంతోనే టీజర్ ఓపెన్ చేశాడు. వైఎస్‌ఆర్ మరణం తరువాత జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను షార్ట్ ఫాంలో చూపించాడు.
అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వ్యూహాలు వేయడం.. జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం చూపించాడు. టీడీపీ హయాంలో వైసీపీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాటన్నింటినీ దాటి జగన్ సీఎం అవడంతో సినిమా ఎండ్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ పాదయాత్ర, అధికారంలోకి వచ్చేందుకు చేసిన పనులు, వివేకా హత్యను వ్యూహం సినిమాలో జగన్‌కు పాజిటివ్‌గా చూపించబోతున్నాడు రామ్‌గోపాల్ వర్మ. చంద్రబాబు క్యారెక్టర్‌ను రివీల్ చేసిన పద్ధతి చూస్తేనే ఈ సినిమాకు ఆయననే విలన్‌ని చేయబోతున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. అయితే ఈ వ్యూహం ట్రైలర్ ఆడియన్స్‌కు చాలా ప్రశ్నలు మిగిల్చింది.
వైఎస్‌ఆర్ అంతిమ సంస్కారం ముగియకముందే జగన్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు అనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. వైఎస్‌ఆర్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలను జరిగింది జరిగినట్టు చూపిస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఇక జగన్ సీబీఐ అరెస్ట్ వెనక చాలా స్టోరీ ఉంది. పక్కా ఆధారాలతోనే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ విషయాన్ని వ్యూహం సినిమాలో ఎలా చూపిస్తాడు అనేది క్వశ్చన్‌మార్క్‌గా మారింది. ఇక వివేకా హత్య కేసు చిక్కుముడి ఇప్పటికీ అలాగే ఉంది. వ్యూహం సినిమాలో దాన్ని ఎలా చూపించబోతున్నారు అనేది సస్పెన్స్‌గా మారింది.
టైం దొరికిన ప్రతీసారి జనసేనను, పవన్ కళ్యాణ్‌ను విమర్శించే రామ్‌గోపాల్ వర్మ.. వ్యూహం ట్రైలర్‌లో మాత్రం పవన్‌ను, జనసేనను చూపించలేదు. సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంటుందా లేదా అనేది కూడా డౌటే. ఏది ఏమైనా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ.. వ్యూహం సినిమాతో మరో కాంట్రవర్సీ క్రియేట్ చేయబోతున్నాడు.