పిఠాపురంలో రాంచరణ్ ఆసుపత్రి.. పవన్‌ను ఆడుకుంటున్న వైసీపీ..
పిఠాపురం.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. పవన్ కల్యాణ్ పోటీ చేయడం.. బంపర్ మెజారిటీతో విజయం సాధించడం.. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో.. పిఠాపురం గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్.. చాలా త్యాగాలు చేశారు.
పిఠాపురం.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. పవన్ కల్యాణ్ పోటీ చేయడం.. బంపర్ మెజారిటీతో విజయం సాధించడం.. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో.. పిఠాపురం గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్.. చాలా త్యాగాలు చేశారు. వైసీపీని పాతాళానికి తొక్కేయడంలో పవన్ పాత్రే కీలకం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక.. సేనానికి మంచి ప్రాధాన్యత దక్కింది. కీలక మంత్రిత్వ శాఖలు తన దగ్గర ఉంచుకున్న పవన్… పాలన మీద పట్టుతెచ్చుకుంటున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఐదు కీలక శాఖలు మంత్రిగా ఉన్న పవన్.. పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో.. ఒక్కో అడుగు వేస్తున్నారు. అక్కడ అపోలో ఆస్పత్రి నిర్మించాలని.. అబ్బాయ్ రాంచరణ్, కోడలు ఉపాసనను డిప్యూటీ సీఎం పవన్ కోరారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 10 ఎకరాల భూమి చూపించి అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సూచించారనే ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఈ ఆసుపత్రి నిర్మాణం వ్యవహారం.. వైసీపీ ఆయుధంగా మార్చుకుంటుందనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ హయాంలో నాడు, నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రులు అభివృద్ధి చేశారని.. వాటి మీద మరింత దృష్టి పెడితే చాలు అని అంటున్నారు. ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసి.. సౌకర్యాలు మరింత పెంచితే బాగుంటుందని అంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందరూ చికిత్స చేసుకోలేరని.. రాయితీలు ఇచ్చినా అది సామాన్యుడికి కష్టమే అవుతుందని.. అందుకే.. ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమో.. లేదంటే కొత్తగా నిర్మించడమో చేస్తే మంచిది అని పోస్టులు పెడుతున్నారు. అపోలోలాంటి ఆసుపత్రి నిర్మాణం జరిగినా.. అలాంటి ఆసుపత్రిలో చికిత్స అనేది సామాన్యుడికి కష్టం అవుతుందని.. దానికి బదులు గవర్నమెంట్ హాస్పిటల్స్‌పై దృష్టి పెడితే బెటర్ అంటూ… పవన్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు కామెంట్లు పెడుతున్నాయ్.