వార్నింగ్ ఇచ్చినా లైట్ తీసుకున్నారు: రంగనాథ్
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడు వివాదాస్పదం అవుతోంది. అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మధ్య తరగతి ప్రజలు హైడ్రా దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడు వివాదాస్పదం అవుతోంది. అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మధ్య తరగతి ప్రజలు హైడ్రా దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు వివాదాస్పదం కావడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పందించారు.
అక్కడి కట్టడాలను తాము కూల్చలేదని క్లారిటీ ఇచ్చారు. మల్కాపూర్లో కట్టడం కూల్చివేతల్లో గాయపడిన హోం గార్డ్ ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. హైడ్రా పై అసత్య వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేసారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే పరిమితమన్నారు. ఇక కూకటపల్లి కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. నోటీసులు ఇస్తున్నా.. కొందరు సీరియస్ గా తీసుకోలేదన్నారు.