ఆక్రమిస్తే అంతు చూస్తాం, రంగనాథ్ సంచలన కామెంట్స్
హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా జిహెచ్ఎంసీ లో భాగం కాదన్న ఆయన... ఇప్పుడు సెపరేట్ వింగ్ గా ఏర్పడిందని స్పష్టం చేసారు. హైడ్రా కు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు.
హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా జిహెచ్ఎంసీ లో భాగం కాదన్న ఆయన… ఇప్పుడు సెపరేట్ వింగ్ గా ఏర్పడిందని స్పష్టం చేసారు. హైడ్రా కు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే మొదటి సారి పెట్టారని… కేవలం జీహెచ్ఎంసీ లో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేసారు. వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్ అన్నిటిపై హైడ్రా వర్క్ చేస్తుంది అన్నారు. హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులు.. ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేది.. ఇపుడు కనెక్టివిటీ లేదని పేర్కొన్నారు.
గట్టి వర్షం పడితే ముంపు వస్తుందని… దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు 10వేల మంది చనిపోయారన్నారు. పేదరికం వల్ల చాలామంది ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. ఐఎండీ వల్ల ముందే ఊహించగలుగుతున్నారని… డిజాస్టర్ట్స్ లో కూడా మార్పులు వస్తున్నాయన్నారు. కంట్రీ లో అర్బనైజేషన్ పెరుగుతుందన్న ఆయన తెలంగాణ లో అర్బనైజేషన్ పెరుగుతుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో వెహికిల్ పాపులేషన్ 80 లక్షలుగా ఉందన్నారు.
సిటీ ట్రాఫిక్ అడిషినల్ సీపీ గా కూడా ఉన్నాను. 2, 3 సెంటిమీటర్ల వర్షం పడితే మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుందని పేర్కొన్నారు. మెట్రో సిటీలలో క్లైమేట్ చెంజెస్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. క్లౌడ్ బరస్ట్స్ కూడా పెరుగుతున్నాయని తెలిపారు. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి.. వర్షం పడినప్పుడు వరద నీరు ఇంకడానికి చాలా సమయం పడుతుందని… సాయంత్రం 4, 5 గంటలకు వర్షం పడితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.. ఇంకడానికి మార్గాలు లేవన్నారు.
సిటీలో 150 వాటర్ లాగింగ్స్ ఉన్నాయని తెలిపారు. అర్బన్ డిజాస్టర్ ల మీద ఫోకస్ పెట్టాలన్నారు. 157 ఏడబ్ల్యుఎస్ స్టేషన్స్ ఉన్నాయి.. ఇంకా కావాలన్నారు. ప్రతి 15నిమిషాలకు బెంగుళూరు లో ఏడబ్ల్యుఎస్ స్టేషన్ ల నుంచి డేటా కలెక్ట్ చేస్తారు.. మనం కూడా దీనికి మారాలని ఆయన వివరించారు. సిటీలో వెదర్ రెడర్స్ కావాలి..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హిల్ ఏరియాలలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వెదర్ అలర్ట్స్ స్పెసిఫిక్ గా ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ వర్షం పడుతుంది అని కాకుండా ఇక్కడ పడదు అని చెప్పేలా వెదర్ అలర్ట్స్ ఉండాలన్నారు. వర్షాలు పడుతున్నపుడు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల ఎకనామికల్ లాస్ కూడా ఏర్పడుతుందని తెలిపారు. హైడ్రా, ఐఎండీ తో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేసారు.