Ravela Kishore Babu: జంపింగ్ స్టార్.. ఐదేళ్లు.. ఐదు పార్టీలు జంప్.. అయినా ఆ నమ్మకం లేకపాయె…
మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంబేద్కర్ కలలు నిజం చేస్తానంటూ.. ఎప్పుడూ చెప్పే డైలాగే మళ్లీ చెప్పారు రావెల. ఇదంతా ఎలా ఉన్నా.. రావెల జంపింగ్ తీరే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది.
Ravela Kishore Babu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ఇంకా నోటిఫికేషన్ రాకముందే.. ఎన్నికల తేదీ కూడా అనౌన్స్ చేసిన స్థాయిలో హడావుడి జరుగుతోంది. రాజకీయ పార్టీల మార్పులు, చేర్పులతో పొలిటికల్ హీట్ మెుదలైంది. వైసీపీ ఇంచార్జిలను మారుస్తుంటే.. ఆ పార్టీలో అసంతృప్తులకు టీడీపీ, జనసేన గాలం వేస్తున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
New Delhi: అనుభవించు రాణి ! అకౌంట్లో రూ.41.. బిల్లేమో 6 లక్షలు.. ఢిల్లీ హోటల్లో ఏపీ మహిళ బిల్డప్
అంబేద్కర్ కలలు నిజం చేస్తానంటూ.. ఎప్పుడూ చెప్పే డైలాగే మళ్లీ చెప్పారు రావెల. ఇదంతా ఎలా ఉన్నా.. రావెల జంపింగ్ తీరే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. ఐదేళ్లలో ఐదు పార్టీలు మారిన రావెలపై.. సగటు ఓటరుకు కాదు కాదు.. సగటు మనిషికి కూడా వెగటు పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. రావెల కిషోర్ బాబు దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2014లో టీడీపీలో చేరారు. అదే ఏడాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి.. మేకతోటి సుచరితపై గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందారో లేదో.. చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయారు. 2018 చివరలో టీడీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరారు. జనసేనలో కూడా ఎక్కువ కాలం ఇమడలేదు. వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా కొద్దిరోజులు మాత్రమే ఉన్న ఆయన.. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
చివరకు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు. ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రావెల మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. వైసీపీ జెండా ఎత్తుకొని.. మళ్లీ ఒక్కచాన్స్ అంటూ మొదలుపెట్టారు. ఐఆర్‌టీఎస్ మాజీ అధికారి అయిన రావెల కిషోర్.. ప్రస్తుతం వైసీపీలో చేరినా ఆయనకు ఎలాంటి హామీ దక్కలేదని తెలుస్తోంది. టికెట్‌పై కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఐదేళ్లలో ఐదుసార్లు పార్టీలు మారి.. జంపింగ్ స్టార్ అనే బ్యాడ్‌నేమ్ తెచ్చుకున్నా.. రావెలకు ఒరిగిందేమీ లేకపాయె.. ఒరుగుతుందన్న నమ్మకమూ రాకపాయె అంటూ జోకులు పేలుతున్నాయ్ సోషల్ మీడియాలో.