REVANTH REDDY: సీఎంగా రేవంత్.. రియల్టర్ల గుండెల్లో దడ..

అంతేకాదు ఆర్.టి.ఐ చట్టం సహకారంతో చాలామంది కాంట్రాక్టర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఓ ఆట ఆడుకున్నాడు రేవంత్. కొంతమంది న్యాయవాదుల బృందాన్ని పెట్టుకొని వారి ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకుంటూ రేవంత్ వాళ్ళని ఇబ్బంది పెట్టాడని విమర్శ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 08:48 PMLast Updated on: Dec 05, 2023 | 8:48 PM

Real Estate Business People Fearing About Revanth Reddy

REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని అనౌన్స్ చేయగానే ఎంతమంది సంతోషపడ్డారో తెలియదు కానీ రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల గుండెల్లో మాత్రం దడ మొదలైంది. ఎన్నికల ముందు నుంచి ఏది జరగకూడదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారో ఇప్పుడు అదే జరిగింది. దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రావడమే. రియల్ ఎస్టేట్ వ్యాపార సరళి మొత్తం తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి.

REVANTH REDDY: సీఎంగా రేవంత్.. స్వగ్రామంలో సంబరాలు..

అంతేకాదు ఆర్.టి.ఐ చట్టం సహకారంతో చాలామంది కాంట్రాక్టర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఓ ఆట ఆడుకున్నాడు రేవంత్. కొంతమంది న్యాయవాదుల బృందాన్ని పెట్టుకొని వారి ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకుంటూ రేవంత్ వాళ్ళని ఇబ్బంది పెట్టాడని విమర్శ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందనే మాట బాగా వినిపిస్తున్నప్పుడే కొంతమంది బడా రియల్టర్లు ముందు జాగ్రత్తగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకుని వచ్చారు. అధికారంలో లేనప్పుడే రేవంత్ అందర్నీ ఒక ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు సీఎం అయితే ఇంకేమైనా ఉందా.. పరిణామాలు ఎలా ఉంటాయో అనే భయం చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్లంతా ఇంటర్నల్ మీటింగులు పెట్టుకుని ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చాలా సఖ్యతగా ఉండేది. వాళ్లకు కావాల్సిన అనుమతులు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉండేది.

కేటీఆర్ కూడా రియల్ ఎస్టేట్ సంస్థలతో వ్యక్తిగత వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. నిర్మాణాల అనుమతులు కూడా జిహెచ్ఎంస , హెచ్ఎండిఏలో వెంటనే వచ్చేస్తూ ఉండేవి. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక తమను ఏ విధంగా ట్రీట్ చేస్తారు.. తమతో ఎలా ఉంటారు.. ఇంతకు ముందులాగా పనులు తేలిగ్గా అయిపోతాయా లేదా.. అసలు రియల్ ఎస్టేట్ రంగం గతంలో లాగా జెట్ స్పీడ్‌తో డెవలప్ అవుతుందా.. ఎవరైనా కొందరు రియల్టర్లను టార్గెట్ చేస్తారా.. ఇలా రకరకాల సమస్యలతో జుట్టు పీక్కుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అంతేకాదు బిఆర్ఎస్ ప్రభుత్వంలో సగం మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చోటామోటా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నేరుగా సంబంధాలు ఉన్నవాళ్లు. ఇప్పుడు వీళ్ళందరూ రేవంత్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ తమను టార్గెట్ చేస్తుందా అనే భయంతో ఉన్నారు.