రియల్ ఎస్టేట్ ని నాశనం చేసింది ఎవరు?
హైదరాబాద్ తో పాటు, తెలంగాణ జిల్లాలన్నిటిలోనూ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఏడాదిన్నర నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ఇంచ్ కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగవలేదు. ఎన్నికల తర్వాత అయినా, రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటుందని అందరూ ఆశపడ్డారు....
హైదరాబాద్ తో పాటు, తెలంగాణ జిల్లాలన్నిటిలోనూ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఏడాదిన్నర నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ఇంచ్ కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగవలేదు. ఎన్నికల తర్వాత అయినా, రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటుందని అందరూ ఆశపడ్డారు…. కానీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే రియల్ ఎస్టేట్ పతనానికి కారణం అంటూ బి ఆర్ ఎస్ నేతలు కేటీఆర్ ,హరీష్ రావులు పదేపదే విమర్శిస్తున్నారు. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగా ఎవరి వలన నాశనమైంది, ఈరోజు ఆ రంగం పతనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు కారణం?
రాష్ట్రం విడిపోతే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పతనమైపోతుందని , చాలామంది భయపడ్డారు. కానీ అందరి భయాలను పటాపంచలు చేస్తూ 7 …..8 సంవత్సరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓ వెలుగు వెలిగింది.2014 నుంచి 2022 వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు తిరుగులేకుండా పోయింది. కెసిఆర్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని నిలబెట్టడం, సిటీ చుట్టూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడం, ఐటీ తో పాటు మరిన్ని కంపెనీలు రావడంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కలకలలాడింది .2010లో ఎస్ ఎఫ్ టి రెండు వేల 500 రూపాయలు ఉండేది.20 22 నాటికి ఎస్ ఎఫ్ టి సగటున పదివేల రూపాయలకు పెరిగింది.
దీనిని బట్టి 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ ఎంతగా దూసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే భూములు విలువలు కూడా పెరిగినాయి.
పది రూపాయలు వంద రూపాయలు అయింది. ఇంతవరకు బాగానే ఉంది.2022 నుంచి రియల్ ఎస్టేట్ క్రమంగా కుదేలవడం మొదలైంది ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. రెండు లక్షల అపార్ట్మెంట్లు సిటీలో ఖాళీగా… కొనేవాడు లేక పడున్నాయి. ఇక స్థలాలు, పొలాలు పరిస్థితి కూడా అంతే. ఎక్కడ…. ఇంత కదలిక కూడా లేదు. ఒక కొత్త వెంచర్ ఎక్కడా కనిపించడం లేదు. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ మరింత దిగాలు పడింది. ధైర్యం చేసి ఎవరూ ఒక అపార్ట్మెంట్ కూడా కొనటం లేదు. ఏ స్థలంలో చెరువు ఉందో, ఏది ఎఫ్ టి ఎల్ కిందకి వస్తుందో తెలియక గందరగోళంలో జనం అపార్ట్మెంట్ కొనుగోలుకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బి ఆర్ ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2022లోనే పతనమైంది.
ఇప్పుడు కొత్తగా జరిగిందేమీ కాదు. దీనికి ప్రధాన కారణం కేటీఆర్, కెసిఆర్ అనుసరించిన విధానాలు. బి ఆర్ ఎస్ నాయకులందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కి ఫినిక్స్, వంశీరాం, మై హోమ్, ప్రతిమ, అపర్ణ, వెరిటేక్స్ తో పాటు అనేక రియల్ ఎస్టేట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. తాము ఆస్తులు పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ బూమ్ సృష్టించారు కేటీఆర్ అండ్ గ్యాంగ్. అవసరానికి మించి విపరీతంగా అనుమతులు ఇచ్చారు. ఎఫ్ ఎస్ ఐ… అంటే ఫిక్స్డ్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలను తుంగలో తొక్కి సిటీ అంతా… హై రైజ్ బిల్డింగులకు అనుమతులు ఇచ్చారు. ఎటు చూసినా 30 నుంచి 50 ఫ్లోర్ల వరకు నిర్మాణాలే. బిల్డర్ల నుంచి అడ్డగోలుగా కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ పై ఏసీబీ రైడ్ చేస్తే 2000 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఒక అధికారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?. ఇదంతా అక్రమ అనుమతులు, హై రేస్డ్ అనుమతులు ద్వారా సంపాదించింది.
అలాంటి అధికారులు ఇంకా వందల మంది ఉన్నారు. సిటీలో ఎకరం స్థలంలో కూడా 30…. 40 ఫ్లోర్స్ కి అనుమతులు ఇచ్చారు. అక్కడ పార్కింగ్ కి తగిన ప్లేస్ ఉందా లేదా చూడలేదు, డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ తగినంత ఉన్నాయా లేదా పట్టించుకోలేదు. హైదరాబాదుకు ఎనిమిది లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నా కూడా సిటీలోనే 30… 40 ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చేసి జనం మొత్తం ఒకే చోట్ల పోగుపడేటట్లు చేశారు, దీనివల్ల సిటీలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య వచ్చింది. ఈరోజుకి జనం నిత్యం ట్రాఫిక్ సమస్యతో అల్లాడిపోవడానికి కారణం 30…. 40 ఫ్లోర్ల హైరిసేడ్ బిల్డింగ్స్. ఈ పాపం వెనక ఉన్నది, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర అధికారులే. ఒక ఎస్ ఎఫ్ టి నిర్మాణానికి అయ్యే ఖర్చు 2,500 రూపాయలు. పోనీ భూమి విలువ చాలా ఉంది అనుకుంటే కూడా… ఎంత మంచి మెటీరియల్ వేసి కట్టినా కూడా సిటీలో ఎక్కడ ఒక ఎస్ ఎఫ్ టి 5000 రూపాయలకు మించదు. కానీ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అడ్డగోలుగా గడిచిన పదేళ్లు జనాన్ని దోచేశాయి. ఎస్ ఎఫ్ టి 20 వేల రూపాయలకు కూడా అమ్మేరు. ఈ రేట్లపై ఎక్కడా నియంత్రణ లేదు. ఎందుకింత ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని అడిగేవాడు లేడు. ఎస్ ఎఫ్ టి కి వంద రూపాయలు చొప్పున టిఆర్ఎస్ నాయకులు బిల్డర్ లో నుంచి వసూలు చేసుకుని ఎలా అనుమతులు కావాలో అలా ఇప్పించారు. దీంతో అడ్డు అదుపు లేని నిర్మాణాలు జరిగాయి. జనం అవసరానికి మించి నిర్మాణాలు చేసేసారు. దీంతో ఒక్కసారిగా రెండు లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడు పోలేక అలా పడి ఉన్నాయి.
ఇక భూముల విషయంలోనూ కెసిఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆర్టిఫిషియల్ భూమ్ ఈరోజు రియల్ ఎస్టేట్ పతనానికి ప్రధాన కారణం. ఓరార్ పక్కన ఎకరం 100 కోట్ల రూపాయలకు రాజ్ పుష్ప సంస్థకు ఆప్షన్ ద్వారా విక్రయించి కెసిఆర్ సర్కార్ భూములు రేట్లు పెంచాలని ప్రయత్నించింది. నిజానికి అక్కడ ఎకరం 10 కోట్లు కూడా చేయదు. రాజ్ పుష్ప సంస్థతో కుమ్మక్కై కెసిఆర్ అక్కడ ఎకరం 100 కోట్లకు ప్రభుత్వమే అమ్ముతున్నట్లు హై ఫై డ్రామా చేశారు. దీంతో చుట్టుపక్కల భూములు కూడా 70 నుంచి 80 కోట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. ఇది అప్పట్లో కెసిఆర్, కేటీఆర్ చేసిన అత్యంత పెద్ద నేరం. ఎకరం 100 కోట్లకు ఉంటే ఆ స్థలంలో కట్టిన ఒక అపార్ట్మెంట్ ఎంతకమ్మాలి?. కనీసం 5 కోట్ల రూపాయలు కు కు అమ్మాల్సి ఉంటుంది. సామాన్యుడు అయిదు కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనగలడా? ఇదో పెద్ద మోసం. ఇలాంటి టెక్నికులు కేటీఆర్ పదేళ్లలో చాలా చేశారు. సామాన్యుడికి ఇల్లు, అపార్ట్మెంట్లు అందుబాటు లేకుండా, మార్కెట్ ని విపరీతంగా పెంచేశారు. హైదరాబాదులో ఒక 2000 ఎస్ ఎఫ్ టి డబల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం రెండు కోట్ల రూపాయలు అవుతుంది. కామన్ మెన్ కి అది సాధ్యమేనా? ఈ దుస్థితికి కారణం అప్పుడు కేటీఆర్, కెసిఆర్, బి ఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే.
2010లో 50 లక్షల రూపాయలకు వచ్చిన అపార్ట్మెంట్ 2020 నాటికి రెండు కోట్ల రూపాయలకు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ దే. సామాన్యుడు రెండు కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనే పరిస్థితి ఇప్పుడు ఉందా? అందుకే అపార్ట్మెంట్లు కొనడానికి జనం వెనకడుగు వేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆర్టిఫిషియల్ బూమ్ రియల్ బిజినెస్ ని దారుణంగా దెబ్బతీసింది. రేట్లు విపరీతంగా పెంచి… భూములను వీళ్లే అమ్మి బిల్డర్ నుంచి వందల కోట్లు లంచాలు తీసుకొని అపార్ట్మెంట్ల రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల జనం కొనుగోలుకు దూరం అయిపోయారు. ముంబై ,ఢిల్లీ ,బెంగళూరు పరిస్థితి వేరు. హైదరాబాద్ పరిస్థితి వేరు. కానీ హైదరాబాదులో అపార్ట్మెంట్లు రేట్లు విపరీతంగా పెరిగిపో దానికి కారణం కేటీఆర్ బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించిన తీరే. చివరికి అది మార్కెట్ ని పూర్తిగా దెబ్బతీసింది. ఈరోజు 2 లక్షలు యూనిట్లు ఖాళీగా పడున్నాయి. ప్రభుత్వమే ఎకరం 100 కోట్లకు అమ్మితే… ఇక మార్కెట్ పరిస్థితి ఏంటి.? సామాన్యుడు ఇంటి కల తీరేది ఎలా? ఇవన్నీ కేసీఆర్ సర్కార్ ఆలోచించలేదు.
హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అద్భుతంగా పెరిగిపోతుందని ప్రగల్బాలు పలికేరే తప్ప… సామాన్యుడికి సొంత ఇంటి కల నెరవేరట్లేదు… కేవలం బిల్డర్లు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే బాగుపడ్డాయి అనే విషయం తెలిసి కూడా అన్ని అరాచకాలు చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తామని ప్రకటించి అక్కడ కూడా భూములు రేట్లు పెరిగిపోయేటట్టు చేశారు. జనం అటుపరుగెట్టి వేలకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు మునిగిపోయారు. కెసిఆర్ కుటుంబం చేసిన దారుణాలు, వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి చేసిన అక్రమాలు ఇప్పుడు పరోక్షంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని దెబ్బతీశాయి. ఎస్ ఎఫ్ టి 8 వేలకు కు మించకుండా కట్టడి చేసి ఉంటే అటు బిల్డర్లు ,ఇటు సామాన్య జనం బాగుండేవారు. కానీ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆతృతపడి అసలుకే ఎసరు తెచ్చుకుంది. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా రియల్ ఎస్టేట్ పెరగడం లేదు. ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా, లక్షల ఉద్యోగాలు సృష్టించిన దానికి మించి నిర్మాణాలు చేయడం వలన జనం అపార్ట్మెంట్లు కొనే పరిస్థితి వెంటనే రాదు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిత్యం రేవంత్ రెడ్డిని తిట్టినందువలన ఉపయోగం లేదు. అపార్ట్మెంట్ల రేట్లు అదుపు చేసి, హై రేస్డ్ బిల్డింగులను నియంత్రిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది జనము బాగుపడతారు.