సె* వీడియోల వెనక అసలు సీక్రెట్స్‌..

వరదలను ఏపీని చుట్టుముడితే.. ఓ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ముంచెత్తింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన తీవ్ర వివాదంగా మారింది. టీడీపీకి చెందిన మహిళ నేతపై.. ఎమ్మెల్యే ఆదిమూలం రొమాన్స్ వీడియోలు తెలుగు స్టేట్స్‌లో హల్‌చల్ చేశాయ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 11:59 AMLast Updated on: Sep 06, 2024 | 11:59 AM

Reason Behind Se Videos

వరదలను ఏపీని చుట్టుముడితే.. ఓ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ముంచెత్తింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన తీవ్ర వివాదంగా మారింది. టీడీపీకి చెందిన మహిళ నేతపై.. ఎమ్మెల్యే ఆదిమూలం రొమాన్స్ వీడియోలు తెలుగు స్టేట్స్‌లో హల్‌చల్ చేశాయ్‌. టీడీపీ పార్టీకి చెందిన మహిళ.. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో.. మీడియా సమావేశం పెట్టి మరీ తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లోని రూమ్ నెంబర్ 109లోకి పిలిచి.. తనపై ఎమ్మెల్యే కోనేటి అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. బెదిరించి తనపై ఆదిమూలం మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది.

ఎవరికైనా చెప్తే.. తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు వివరించింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే.. ఈ ఘటన కాస్త పొలిటికల్‌గా తీవ్ర రచ్చగా మారింది. ఆ మహిళ… టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు. తన బాధలు, కోనేటి అసలు రూపం చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది.

చంద్రబాబు ఆదేశాల మేరకు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐతే ఆదిమూలం వీడియోపై.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మరోలా రియాక్ట్ అవుతున్నారు. ఆయన అలాంటివారు కాదని.. కావాలని ఇరికించారని అంటున్నారు. ఐతే అటు ఆదిమూలం కూడా వీడియోల మీద రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ ఫేక్ అని.. తన పని తీరు ఏంటో.. నియోజకవర్గం మొత్తం తెలుసు అంటూ క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు. ఐతే వీడియోలు నిజమా కాదా అన్నదానిపై అసలు విషయం తేలుస్తామని.. ఆ వీడియోలను ల్యాబ్‌కు పంపిస్తున్నామని.. అసలు విషయం తెలిసే వరకు ఆదిమూలంపై.. సస్పెన్షన్ అలానే కొనసాగుతుందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయ్.