రెడ్ బుక్ ఇన్ యాక్షన్… భయపెడుతున్న లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ వ్యవహారం.. మరోసారి హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా.. ఢిల్లీ టూర్ లో ఉన్న మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ వ్యవహారం.. మరోసారి హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా.. ఢిల్లీ టూర్ లో ఉన్న మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రెండు బుక్ వర్క్ కొనసాగుతోందని.. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన అధికారులు, నాయకులకు కచ్చితంగా చట్టపరంగా బుద్ధి చెప్తామని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నాయకులు, సినీనటులను ఇటీవల కాలంలో అదుపులోకి తీసుకుంటున్నారు. వీరందరిపై రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.
ఉదాహరణకు సినీ నటుడు పోసాని కృష్ణమురళి పై శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎన్నో కేసులు నమోదు చేశారు. పలు ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదు చేసి, పిటి వారెంట్ దాఖలు చేసి రాష్ట్రవ్యాప్తంగా తిప్పుతున్నారు. గతంలో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అందుకే దీనిపై విమర్శలు వచ్చినా సరే.. పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. అలాగే అటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించారు.
వంశీ మోహన్ పై గతంలో నమోదైన కేసులను బయటకు తీస్తున్నారు. అలాగే ఆయన కారణంగా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ తో పాటుగా కృష్ణా జిల్లాలో పలు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీ విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోనే మాజీమంత్రి కొడాలి నానిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కొడాలి నాని వాలంటీర్లను బెదిరించిన కేసులో అలాగే గుడివాడ పట్టణంలో కబ్జాలు చేసిన వ్యవహారంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
ఇక చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి విడుదల రజిని.. విషయంలో కూడా పోలీసులు సీరియస్ గానే దృష్టి పెట్టారు. కొంతమంది గ్రానైట్ వ్యాపారులను ఆమె బెదిరించారని.. అలాగే స్టోన్ క్రషర్ యజమానులను కూడా బెదిరించినట్లుగా పోలీసులు ఆధారాలను సేకరించారు. త్వరలోనే గవర్నర్ అనుమతి తీసుకుని.. ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి తప్పనిసరి అయింది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి పేర్ని నాని పై కూడా పోలీసులు దృష్టి సారించారు.
రేషన్ బియ్యం అక్రమాలతో పాటుగా బందరు పట్టణంలో ఆయన చేసిన కొన్ని అక్రమాలకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా కొన్ని ఆధారాలున్నాయి. దీనితో త్వరలోనే నానిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చు అనే వార్తలు వస్తున్నాయి. అటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా దృష్టి సారించారు.
ఇటీవల కాలంలో ఆయన కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనపడినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను పోలీసు వర్గాలు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వీటిపై కూడా చర్యలు ఉండే అవకాశం ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై కూడా దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.