Top story: వైసీపీలో రెడ్డి … నాన్ రెడ్డి వార్
జగన్ ఎక్కడ మాట్లాడినా అతను నోట్లోంచి వచ్చే మాట నా ఎస్సీలు... నా బీసీలు. ఈ నా ఎస్సీలు నా బీసీలు డైలాగే మొన్నటి ఎన్నికల్లో జగన్ కొంపముంచింది. వైసీపీలో పేరుకి ఎస్సీలు, బీసీలు నామస్మరణ చేస్తారే తప్ప.... నడిపించేదంతా రెడ్లే.

YCP Chitchittu.. Coalition is the power.. Indiatoday My Axis Sensational Exit Poll...
జగన్ ఎక్కడ మాట్లాడినా అతను నోట్లోంచి వచ్చే మాట నా ఎస్సీలు… నా బీసీలు. ఈ నా ఎస్సీలు నా బీసీలు డైలాగే మొన్నటి ఎన్నికల్లో జగన్ కొంపముంచింది. వైసీపీలో పేరుకి ఎస్సీలు, బీసీలు నామస్మరణ చేస్తారే తప్ప…. నడిపించేదంతా రెడ్లే. ఎవరు అవునన్నా కాదన్నా వైసీపీ రెడ్ల పార్టీయే. ఈ మాట బయట జనం మాట్లాడుకునేదే కాదు పార్టీలో కూడా అందరూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వైసీపీలో రెడ్డి నాన్ రెడ్డి వార్ రోజు రోజుకి ముదురుతోంది. పార్టీలో రెడ్లకు ప్రాధాన్యం తగ్గించకపోతే భవిష్యత్తు కష్టమవుతుందని ఓపెన్ గానే మిగిలిన కులాల వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు.2019….24 మధ్య జగన్ పాలన అంతా రెడ్డి రాజ్యమే నడిచింది. ఓటమి తర్వాత పార్టీలో మిగిలిన కులాలు ఓపెన్ గానే రెడ్డి వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి.
ఏపీ రాజకీయాలను రెండు అగ్రకులాలు శాసిస్తున్నాఅనేది జగమెరిగిన సత్యం. వైసీపీ అంటే రెడ్ల పార్టీ. టిడిపి అంటే కమ్మ వాళ్ల పార్టీ. దీనిలో మరో వాదనే లేదు. 2009లో పి అర్ పి…..2014లో జనసేన వచ్చినప్పుడు మాత్రమే కాపులకు కూడా ఒక పార్టీ ఉంది అని జనం మాట్లాడుకున్నారూ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ కోసం పూర్తిగా జనసేనతో నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కోసమే మూకుముడిగా టిడిపికి కూడా ఓటు వేశారు. మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్న ఏపీ రాజకీయాల్ని కమ్మ, రెడ్డి కులాలే ఈరోజుకి శాసిస్తున్నాయి.
అయితే తెలుగుదేశం వ్యవహార శైలి వైసీపీకి భిన్నంగా ఉంటుంది. టిడిపి అధినాయకత్వం ఎప్పటికీ కమ్మ కులం చేతిలోనే ఉంటుంది. టిడిపి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ,చంద్రబాబు కుటుంబీకులే అవుతారు. అంతేకాక కమ్మ సామాజిక వర్గం ఒక ఓజోన్ లేయర్ లాగా టిడిపిని కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఈ భావన ఎక్కడా కనిపించకుండా టిడిపి మొదటినుంచి బీసీలకు, ఇతర కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కలరింగ్ చూపిస్తుంది. అందుకే బీసీ కులస్తుడైన అచ్చం నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తెర పై పెడతారు. బీసీలకు ఎస్సీలకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లే చూపిస్తారు. అంతేకాదు వాళ్ళకి సముచిత గౌరవం కూడా ఉంటుంది. అందువల్ల టిడిపిలో కుల పరమైన అసంతృప్తి సాధ్యమైనంత వరకు రాదు.
వైసీపీ విషయానికొస్తే అలా ఉండదు. అది 100% రెడ్ల పార్టీ. ఎవరు ఎలా అనుకున్నా కూడా రెడ్ల కి అన్ని స్థాయిల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు.
పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు అని గట్టిగా అరుస్తుంటాడు. ఆ పార్టీలో ఎస్సీలు, బీసీలు నిర్ణయాత్మక శక్తి కానే కాదు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఐదుగురు డమ్మీ డిప్యూటీ సీఎం లను పెట్టాడు. ఎస్సీలు ,బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యమిస్తూ డిప్యూటీ సీఎం పదవులు వాళ్ల కేటాయించాడు. కానీ వాళ్లు పూర్తిగా డమ్మీలనే విషయంబయట అందరికీ తెలుసు. అసలు రాజ్యాంగంలోనే లేని డిప్యూటీ సీఎం ఏ కులం వాడికి ఇచ్చినా ఒకటే. ఆ పోస్టుకి ప్రత్యేకంగా పవర్స్ ఉండవు. అది అందరిలాంటి మంత్రి పదమే.
ఇక వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ఎలా ఉంటుంది అనడానికి ఆ పార్టీలో రీజనల్ ఇన్చార్జిల నియామకమే ఒక ఉదాహరణ. పార్టీకి జగన్ మోహన్ రెడ్డి సెంటర్ పోల్ అయితే నాలుగు స్తంభాలాగా విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించేవారు. ఉత్తరాంధ్రాకి ఇన్చార్జిగా జగన్…. విజయ్ సాయి రెడ్డిని నియమించాడు. అలాగే రాయలసీమకి ఇంచార్జిగా సజ్జల ఉండేవాడు. కోస్తా జిల్లాలకు మిధున్ రెడ్డి ఇన్చార్జిగా ఉండేవాడు. అసలు విజయసాయిరెడ్డి అనే వ్యక్తికి ఉత్తరాంధ్రకి సంబంధం ఏమిటో ఎవరికి తెలియదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు విజయ్ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖ్యమంత్రి లా వ్యవహరించాడు.
అక్కడ ప్రతి వ్యాపారంలో, రియల్ ఎస్టేట్లో ఆయన వేలు పెట్టాడు. ఉత్తరాంధ్రని అల్లకల్లోలం చేసి వదిలిపెట్టాడు. అక్కడ వైసీపీ దారుణ ఓటమికి విజయ్ సాయి రెడ్డి ప్రధాన కారణం. ఇక మిధున్ రెడ్డికి కోస్తా జిల్లాలకి ఏ సంబంధము ఎవరికీ అర్థం కాదు. సాయిరెడ్డి అంతా అల్లకల్లోలం చేయకపోయినా మిథున్ రెడ్డికి కోస్తా జిల్లాల పాలిటిక్స్ అసలు అర్థం కాలేదు. కోస్తా జిల్లాల్లో మిధున్ పూర్తిగా వైఫల్యం చెందాడు. ఇక సజ్జల రాయలసీమ వ్యవహారాలను పట్టించుకున్నదే లేదు. ఆయన నెంబర్ 2 లా వ్యవహరించి మొత్తం పార్టీని ముంచాడు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో మిగిలిన రెడ్లు అంతా సామంత రాజుల్లా వ్యవహరించారు. చివరికి ఓటమి తర్వాత కూడా మళ్లీ సాయిరెడ్డి నేను తీసుకెళ్లి ఉత్తరాంధ్రకి ఇంచార్జిగా పెట్టాడు జగన్. ఆ ప్రాంతం నాశనం అయిన….. తన పార్టీ నాశనం అయిన కూడా సాయిరెడ్డి పై మమకారం పోలేదు జగన్ రెడ్డికి. సాయి రెడ్డి నిష్క్రమణ తర్వాత జ్ఞానోదయం అయ్యింది.
చివరికి కాపు కులస్తుడైన కురసాల కన్నబాబుని ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఇంచార్జిగా పెట్టారు. ఇది కేవలం ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యవహారమే కాదు పార్టీలో ఇప్పటికీ రెడ్ల హవాయే నడుస్తుందని మిగిలిన కులాల నాయకులు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. పేరుకి ఎస్సీలు, బీసీలు అని నినాదాలు చేసినప్పటికీ పెద్ద పోస్టులన్నిటిలోనూ రెడ్లే ఇప్పటికీ వైసీపీలో చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్ చుట్టూ రెడ్లే ఉండేవారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ అనిల్ రెడ్డి వీళ్లు జగన్ చుట్టూ దడి కట్టేవారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, గుడివాడ నాని లాంటి వాళ్లకు సెకండ్ ప్రయారిటీ మాత్రమే దక్కేది. జగన్ ఆర్థిక వ్యవహారాలని పూర్తిగా రెడ్లు మాత్రమే హ్యాండిల్ చేసేవాళ్లు. చివరికి లిక్కర్ స్కామ్ లో కూడా రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించాడు.
వైసీపీలో రెడ్ల ఆధిపత్యం… ప్రభావం ఎంతగా ఉంటుందంటే మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో 54 అసెంబ్లీ సీట్లు ఎక్కడ ఒక్క బలిజ కి కూడా సీట్ ఇవ్వకుండా ధైర్యంగా, మొండిగా బరిలోకి దిగాడు జగన్. అదేమని అడిగితే బలిజలు ఈసారి మనకు ఎలాగూ ఓటు వేయరు. కనుక వాళ్లకి టికెట్ ఇచ్చి వృధా అని నిర్మోమాటంగా చెప్పేసాడు జగన్. ఇక జగన్ హయాంలో పార్టీలో రెడ్లే ఎక్కువగా సంపాదించారు. వ్యాపారాలు కూడా భారీగానే చేశారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిధున్ రెడ్డి, సుబ్బారెడ్డి ఐదేళ్లలో ఒక్కరోజు కూడా వృధా చేయకుండా కుమ్మి పడేశారు. సాయి రెడ్డి విశాఖలో వ్యాపారాలు విస్తరించాడు. సజ్జల…. ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి తెలివిగా పైకి కనబడకుండా మైన్స్, ఎడ్యుకేషన్, స్కూల్స్, టాబ్స్ ఇలాంటి వాటిలో కోట్లు కొట్టేశారు. ఇక లిక్కర్ స్కామ్ మొత్తం మిథున్ రెడ్డి కనుసన్న లోనే జరిగింది. సుబ్బారెడ్డి ఆయన కుమారుడు కాకినాడ సీ పోర్టు, ఎస్సీ జడ్ లో వాటాలు కొట్టేశారు. మిగిలిన కులాల నాయకులకు అవినీతిలో కూడా ఎక్కడ జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నారు.
ఇప్పుడు అధికారం పోయాక దీనిపై బాగా చర్చ జరుగుతుంది. పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఏమాత్రం తగ్గలేదు. మిగిలిన కులాల వాళ్లందర్నీ ప్రెస్ మీట్ లకి, ధర్నాలకి, ఆందోళనలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ జగన్ తో క్లోజ్ డోర్ మీటింగ్స్ లో మాట్లాడుకునేది రెడ్లే అని పార్టీలోనే బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు.ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన కులాల వాళ్ళు పార్టీలో ఉండాలా వెళ్లిపోవాలా అని చర్చించే నాయకులు లేకపోలేదు. టిడిపిలోకి వెళ్తే అక్కడైనా కమ్మ ఆదిపత్యమే కదా…. లోకి వెళ్దాం అంటే అది భవిష్యత్తు లేని పార్టీ…. తిట్టుకుంటూనో తుమ్ముకుంటునో వైసీపీలోనే ఉండాలా? లేక నిత్యం నిరసన గళం వినిపిస్తూ ఉండాలా అనే మీ మాంసలో కొట్టుమిట్టాడుతున్నారు వైసీపీలో మిగిలిన కులాల నేతలు.